శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి వినుత కోటామండల MRO మరియు నియోజకవర్గ ఎన్నికల అధికారి అయిన ద్వారకనాథ్ రెడ్డిని తాసీల్దార్ కార్యాలయంలో కలవడం జరిగింది. నియోజకవర్గంలో వేల సంఖ్యలో ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నట్లు ప్రముఖ ప్రత్తికల్లో వచ్చిన కథనాలు, క్షేత్ర స్థాయిలో ప్రజలు ఇచ్చిన సమాచారంతో MRO గారికి తెలియజేసారు. దొంగ ఓట్లకి ఎలాంటి అవకాశం లేకుండా బూత్ స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అలానే “0” డోర్ నంబర్ తో కూడా వేల సంఖ్యలో ఉన్న ఓట్లను సమగ్రంగా పరిశీలించి దొంగ ఓట్లు ఉన్నట్లైతే తొలగించాలని కోరడం జరిగింది. బూత్ స్థాయిలో బి.యల్.ఓ పరిశీలనకు వెళ్ళినపుడు తప్పనిసరి జనసేన పార్టీ బూత్ ఏజెంట్లకు సమాచారం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పల గోపి, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షుడు తోట గణేష్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్రశేఖర్ , నాయకులు గురవయ్య, బొక్కిసం రాజశేఖర్, కిషోర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.