విజయవాడ ( జనస్వరం ) : ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం రెండో విడతలో భాగంగా 52 వ రోజు 45 వ డివిజన్ అధ్యక్షులు బొమ్ము రాంబాబు గోవింద లక్ష్మి ల ఆధ్వర్యంలో కొండ బడి ఎదురు రామకోటయ్య వీధి వద్ద నుండి ప్రారంభించి కొండ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహేష్ మీడియాతో మాట్లాడుతూ కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్తుంటే స్ధానిక ప్రజులు అనేక సమస్యలు చెప్తున్నారు, మమ్మలని పట్టించుకునే నాథుడే లేడు, మేము పిలిస్తే పలికే స్తానిక ప్రజా ప్రతినిధులు లేరని, పార్టీ మారితే మాసమస్యలు తీరుస్తారు అనుకుంటే స్తానిక కార్ప్రేటర్ కనిపించకుండా పోయాడని ప్రజలు వాపోతున్నారని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నామని మీరు కొండ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి పెట్టి వారి సమస్యలు పరిష్కరించాలని , కొండ ప్రాంతంలో నిధులు కేటాయించి పాడైన మెట్లు, డ్రైనేజీ లు బాగుచెయ్యలని కోరారు. పారిశుధ్యం మీద దృష్టి పెట్టాలని, మీరు ఈ మంచి పనుల మీద దృష్టి పెడితే ఒక మంచి కమిషనర్ గా పేరు వస్తుందనీ అంతే గానీ మీరు వైసిపి నాయకుల అక్రమ నిర్మాణాలు చేస్తూంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే వైసీపీ అవినీతిపరుల అక్రమ నిర్మాణ దారుల్ని మీరు ప్రోత్సహించినట్లే అవుతుందని, 40వ డివిజన్ లో ఒక మహిళ బతుకుతెరువు కోసం ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఆశ అనే ఆమె అక్రమంగా తొలగించారని అన్నారు. ఆశా (బిల్డింగ్ ఇన్స్పెక్టర్) కి చెప్పేది ఒకటే 40వ డివిజన్లో సందు సందుకి ఉన్న అక్రమ నిర్మాణాల లో మీ వాటా ఏంతో చెప్పమంటార అని అన్నారు. మా మీద ప్రెస్ మీట్ పెట్టిన రెడ్డి సామాజిక వర్గం బడ్డీ కొట్టు తొలగించిన ఆమెది కూడా రెడ్డి సమాజిక వర్గానికి చెందిన ఒక పేద మహిళలదేనని దీని మీద మీరందరూ కూడా మాట్లాడి ఉంటే బాగుండేదని దుర్మార్గులుకి వ్యసనపరులకి అండగా నిలిచే మీరు మి సామాజిక వర్గం ఒక పేద రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహిళకి అన్యాయం జరిగితే మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని కమిషనర్ గారు మీరు ఈ ఘటన మీద కుడా స్పందించాలని అన్నారు.