శింగనమల ( జనస్వరం ) : ముకుందాపురం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డిని దళిత నాగరాజు సమస్యలపై ప్రస్తావించారు. నాగరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయన అనుచరులు హేళన చేస్తూ కులం పేరుతో ఆయనని దూషిస్తూ నెట్టివేసిన ఘటనను జనసేన సీనియర్ నాయకులు దంపేట్ల శివ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం వర్గానికి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేనా లేక ఆలూరు సాంబశివరెడ్డి నా అని ప్రశ్నించడం జరిగింది. ప్రజా సమస్యలు అడిగినందుకు దళిత నాగరాజు పై అవహేళనగా మాట్లాడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడడం హేమమని అన్నారు. యస్.సి, యస్.టి, బిసిలతోనే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఈరోజు వారినే చిన్న చూపు చూడటం దౌర్భాగ్యం అన్నారు. మాహనీయుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ వైసీపీ నాయకులు తుంగలో తొక్కేశారు. ఇలాగే అణగారిన వర్గాలను తక్కువ చేసి చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలే వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా జనసేన పార్టీ ఉంటుందని అన్నారు. దళిత నాగరాజు పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల మీద అధికార ప్రభుత్వం చేస్తున్న దాడులను ఖండిస్తూ, పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.