పాడేరు ( జనస్వరం ) : అరకులో తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావంగా అరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండల నాయకులు, జనసైనికులు భారీగా నిరసన ధీక్ష శిభిరంలో చేరుకుని సంఘీభావం తెలపారు. ఈ సందర్బంగా జనసేనపార్టీ అరకు నియోజకవర్గ నాయకులు బలిజ కోటేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు అరెస్ట్ నిజాయితీ దక్కిన ప్రతిపలమని, నియంత రాజకీయాలకు ఇటువంటి కక్ష్య పూరిత కుట్రలకు ఒక ఉదాహరణగా భావిస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మనమంతా కలిసి ఎన్నికలకు సమాయత్తం అవ్వాలని లేదంటే నిజాయితీ గల నాయకులను కూడా జైల్లో పెట్టడానికి ఈ రాక్షస ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రిగారైన దివంగత నేత వై.ఏస్ రాజశేఖర్ రెడ్డి గారికి సమకాలికులు వారిరువురు మధ్య సహృద్భవా రాజకీయ విమర్శలు మాత్రమే ఉండేవని, కానీ ఇటువంటి కక్ష్యపూరిత రాజకీయలెన్నాడు చేయలేదని అన్నారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవుత్తి కలవారు పదవ తరగతి ప్రశ్న పత్రం దొంగిలించి జైలుపాలు అయినప్పటినుంచి ఇప్పటిదాకా ప్రతిదీ నేర స్వభావంగానే ఉంటుందని అన్నారు. అప్పట్లో పదవ తరగతి ప్రశ్న పత్రమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ప్రజలఆస్తులు, భవిష్యత్ దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మొదటి నుంచి వ్యవస్థలను ధిక్కరించి ఎదురేళ్లడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ధిక్కరించడం రాక్షనందం పొందడం ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటని అన్నారు.
అరకు నియోజకవర్గ జనసేన పార్టీ నేత ధురియా సాయిబాబా మాట్లాడుతూ ప్రజలను దోచుకుని లక్షకోట్లు సంపాదించారని అందుకు ప్రతిపలమే 33 కేసులు ప్రతి శుక్రవారం వాయిదా, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు నామం జపించడమని ఎద్దేవా చేశారు. ఆంధ్ర లో పులి ఢిల్లీలో పిల్లి. ఇక్కడేమో మా నాయకుడు సింహం అంటూ డప్పులు కొడుతూ చిడతాలు వాయిస్తే మన ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీకెళ్లి ప్రధాన మంత్రి బూట్లకు పాలిష్ చేసి వస్తుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మా అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు దేశం నాయకులు లోకేష్ మిగతా నాయకులతో కలిసి ఇటువంటి కక్ష్య పూరిత రాజకీయాలకు శాశ్వత పరిష్కారం చేస్తారని మనమంతా ప్రజాస్వామ్యయుతంగా కలిసి కట్టుగా ఎదుర్కొందమని ఈ సందర్బంగా తెలియజేస్తూ మీరు చేసే ధర్మపోరాటానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి అదేశాలమేరకు మీకు తోడుంటామని సంఘీభావం వ్యక్తం చేశారు. అరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సాయిబాబాదురియా,బలజ కోటేశ్వరరావు పడాల్, మండల నాయకులు నాగరాజు బూడిద, మోహన్ వంతాల,సీదరి ధనేశ్వరరావు,జాగరపు పవన్ కుమార్, రొయ్యల శ్రావన్, చంద్రబాబు గారు మరియు 50 మందికి పైగా జనసైనికులు పాల్గొన్నారు