బొబ్బిలి ( జనస్వరం ) : మున్సిపాలిటీ అధికారులు కొంటి సాకులు చెప్పి, కేవలం జనసేన పార్టీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించినందుకు వెంటనే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు గారు మరియు బొబ్బిలి జనసేన నాయకులు పల్లెం రాజా, సంచాన గంగాధర్, రేవెళ్ల కిరణ్, హరిచరణ్, శ్రీను, శివ శంకర్, వెంకటరమణ, జగన్ వెంటనే మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి జనసేన ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా ఎవరో వైస్సార్సీపీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి బొబ్బిలి వస్తున్నారని మా జనసేన ఫ్లెక్సీలను తియ్యడం ఏంటని, కక్ష్యపూరీతంగా జనసేన ఫ్లెక్సీలను మాత్రమే తియ్యడం ఏంటని, బొబ్బిలి లో వైస్సార్సీపీ పార్టీ ఫ్లెక్సీలను మాత్రం ఉంచి మిగతా పార్టీ ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని అన్నారు. బొబ్బిలిలో ఇలాంటి విష సంస్కృతికి దారి తీయ్యొద్దని రాష్ట్ర కార్యదర్శి బాబు పాలురి గారు టీపీవో గారిని ప్రశ్నించారు. అలాగే ఈ సమస్యపై బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి వైసిపి నాయకులు వైవి సుబ్బారెడ్డి వస్తున్నాడంటే, మా పారాధి బ్రిడ్జి బాగు చెయ్యండి, మా పూల్ బాగ్ రోడ్డు పూర్తి చెయ్యడానికి నిధులు ఇప్పించండి, దారి మల్లించేసిన పంచాయితీ నిధులను తిరిగి పంచాయతీలకి ఇప్పించండి, మా గ్రోత్ సెంటర్ కు కొత్త కంపెనీలను తీసుకురండి, మా బొబ్బిలి రైతుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చెయ్యండి అని అడిగే దమ్ము లేదు గాని..మీ వైసిపి బాసులు వస్తున్నారని, వాళ్లని సంతోషపెట్టడం కోసం జనసేన ఫ్లెక్సీల మీద టార్గెట్ చేసే పిచ్చ ఆలోచనలను మానుకోవాలని బాబు పాలూరు గారు హితవు పలికారు.