గుంతకల్ ( జనస్వరం ) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు పై రాష్ట్రవ్యాప్తంగా “సత్యమేవ జయతే” పేరుతో తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసన దీక్షకు సంఘీభావంగా గుంతకల్ పట్టణం, స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర మాజీ శాసనసభ్యులు జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న దీక్ష విరమణ కార్యక్రమానికి గుంతకల్ పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో హాజరై సంఘీభావం తెలిపిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ. ఆయన మాట్లాడుతూ వైసిపి నిరంకుశ పాలనకు ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చిందని, మరో ఆరు నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల ఆశీస్సులతో తిరుగులేని మెజారిటీతో జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందని కావున అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీల పట్ల ఉందా వైఖరిని అవలంబించాలని వారి హక్కులను కాలరాసే విధంగా అక్రమ అరెస్టులు చేస్తే, చూస్తూ ఊరుకోబోమని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గట్టిగా ఎదుర్కొని అధికార పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు బండి చంద్రకళ, ఈరమ్మ గుంతకల్ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడుపాండు కుమార్ సీనియర్ నాయకులు కప్పట్రాళ్ల కోటేశ్వరరావు, ఆటో రామకృష్ణ, కత్తులగేరు అంజి కాపు సంక్షేమ సేన నాయకులు కసాపురం నందా, అఖిల్ రాయల్, పవన్ మైనారిటీ నాయకుడు దాదు జనసైనికులు, నాయకులు పామయ్య, రామకృష్ణ, అమర్, లారెన్స్, అనిల్ కుమార్, సూర్యనారాయణ, శ్రీనివాసులు పెద్ద ఎత్తున పసుపు సైన్యం, జన సైన్యం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.