శ్రీకాళహస్తి ( జనస్వరం ) : పట్టణంలోకి ప్రధాన ప్రవేశ ముఖ ద్వారం వద్ద గత కొన్ని నెలలుగా రోడ్డు దారుణంగా గుంతలమయం అవ్వడంతో ఏ అధికారులు పట్టించుకోలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జివినుత కోటా, జనసేన నాయకులు, కార్యకర్తలతో వెళ్లి వినూత్నంగా నీళ్ళు నిండిన గుంటల్లో చేపలు పడుతూ నిరసన తెలిపారు. శ్రీకాళహస్తికి దేశ నలుమూలల నుండి వేల మంది భక్తులు రోజు దర్శనార్థం వస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్ర ప్రాంత ప్రతిష్ట దెబ్బ తీసేలా ప్రవేశంలో రోడ్డు అధ్వాన స్థితిలో ఉంది. శ్రీకాళహస్తి కి వచ్చే భక్తులు ఈ గుంతల రోడ్డు చూడాలా !! స్థానిక ఎమ్మెల్యే బ్యానర్లు చూడాలా!! దేవుడిని దర్శించుకోవాల అన్నట్టు ఉంది. చిన్నపాటి గుంతలకి మట్టి వెయ్యలేనోళ్ళు 3 రాజధానులు కడతారంట, గుంతలకి తట్టెడు మట్టి కూడా వెయ్యలేనొడికి ఎందుకు మళ్ళి ఓటు వెయ్యాలి!! ఎమ్మెల్యే కి ఏ మాత్రం బాధ్యత ఉన్నా రోడ్డు బాగు చెయ్యాలని, 3 రోజుల్లో రోడ్డు బాగు చెయ్యకపోతే జనసేన పార్టీ బాగు చేస్తుందని తెలిపారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, ప్రధాన కార్యదర్శులు పేట చిరంజీవి, రవి కుమార్ రెడ్డి, పేట చంద్ర శేఖర్, వీర మహిళలు దేవి, రేవతి, జయంతి నాయకులు అరుణ్ రెడ్డి ,గురవయ్య , దినేష్, ఉదయ కుమార్, చందు యాదవ్, మహేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.