పాడేరు ( జనస్వరం ) : ఉబ్బెడుపుట్టు గ్రామం, లో అనేక మంది యువత జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి జనసేన పార్టీతీర్థం పుచ్చుకున్నారు.. జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరూ గంగులయ్య గారిని గెలిపించుకోవడమే మా లక్ష్యం అని గ్రామస్తులు తెలిపారు.. ఎన్ని పార్టీలు మారినప్పటికీ గిరిజనుల జీవన విధానం పట్ల బాధ్యత తీసుకోని నాధుడే కరువయ్యాడు అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఓట్ల కోసం మాత్రమే గ్రామస్తులను వాడుకుంటున్నారు, మా సమస్యలు వివరించడానికి నాయకులు కరువయ్యారు అని, 2024లో గ్రామ అభవృద్ది మా లక్ష్యం అని, అది జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని మార్పుకి శ్రీకారం చుట్టాలని, అలాగే, ఉద్యమాలు చేసి మా గిరిజనులు ప్రాంతాల్లో కష్టాలు తెలిసిన వ్యక్తి, గిరిజనుల చట్టాల మీద అవగాహన కలిగిన గంగులయ్య గారిని గెలిపించుకోవడమే మా లక్ష్యం అని తెలిపారు. అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి మురళికృష్ణ మాట్లాడుతూ గ్రమస్తులకు జనసేన పార్టీలో ఆహ్వానం పలికారు.. మార్పుకి శ్రీకారం చుట్టిన యువతికి గ్రామస్తులకు దన్యవాదములు తెలిపారు.
జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యల కోసం తెలుసుకోవడం జరిగింది.. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్ఛితంగా మీ సమస్యల పరిష్కారం చేసే దిశగా, గ్రామంలో అభివృద్ది పరంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.. రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థుల భవిష్యత్తు అందకారంగా మారిందని ఆరోపించారు.. ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు మండల అద్యక్షులు నందోలి మురళికృష్ణ, కాకినాడ రూరల్ ఐటీ విభాగం సభ్యులు సీ. హెచ్.అనిల్ కుమార్, జనసైనికులు, సుమన్, పి యం రాజు, ర్ రాజు,వెంకట్, శ్రీను, సుబ్బారావు, నవీన్, పి. రమేష్, బి. కళ్యాణ్, బింబాబు, గణేష్, సునీల్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.