విజయవాడ ( జనస్వరం ) : పాత రాజరాజేశ్వరి పేట ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ చేయాలని, రైల్వే శాఖకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో పాత రాజరాజేశ్వరి పేట డౌన్ వద్ద జనసేన పార్టీ నాయకులు మరియు స్థానికులతో కలిసి నిరసన తెలియజేసినారు. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ జగన్ గారు సీఎం కాకముందు అయిన తర్వాత పాత రాజరాజేశ్వరి పేట వాసులను మోసం చేశారని,1000 కుటుంబాలకు రైల్వే శాఖకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి వీరికి శాశ్వత ప్రాతిపదికన ఇళ్ళపట్టాలు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి గెలిచారని కానీ నేటికీ ఆ హామీని నెరవేర్చలేదని ప్రతి మూడు నెలలకు ఒకసారి రైల్వే అధికారులు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అయినా జగన్ గారు తాను లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని ఈనెల 29వ తారీఖున వాహన మిత్ర పథకం కోసం సితార సెంటర్ కు వస్తున్న సీఎం జగన్ గారు తక్షణమే పాత రాజరాజేశ్వరి పేట వాసుల ఇళ్ళపట్టాల సమస్య తీర్చి రావాలని లేకపోతే వారికి ఈ ప్రాంత ప్రజలతో పాటు పశ్చిమ జనసేన పార్టీ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జాఫర్, షహీనా, గంగాధర్, పవన్ కళ్యాణ్, కొరగంజి వెంకటరమణ, తమ్మిన లీలా కరుణాకర్, మున్ని, తను శంకర్ అక్షయ్ మహేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.