గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, గాజు గ్లాస్ గుర్తుని ప్రతీ హృదయానికి చేరువ చేసేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఉందని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తుని కేటాయించడం పట్ల స్థానిక శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గాజు గ్లాస్ దిమ్మెకి పూలతో అలంకరణ చేసి గాజు గ్లాస్ లను చేతబూని పవన్ కల్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి చారిత్రక అవసరం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలన అంతం అవ్వాలి అంటే వైసీపీ దూరాగతాలపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు. గతంలో తుగ్లక్ పాలన గురించి విన్నామని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని నేరేళ్ళ సురేష్ విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నేతలు జనసేనకు గుర్తు కూడా లేదంటూ అవహేళనగా మాట్లాడారని వాళ్ళందరికీ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చెంపపెట్టులాంటిదన్నారు. జనసేన పార్టీ ఎవరో స్థాపిస్తే బలవంతంగా లాక్కున్న పార్టీ కాదని దేశ, రాష్ట్ర శ్రేయస్సుని కాంక్షిస్తూ లోకకల్యాణం కోసం పవన్ కల్యాణ్ హృదయంలోంచి ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర మహిళా నాయకురాలు పార్వతి నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత విలువులున్న పార్టీ అని అన్నారు. వైసీపీ పార్టీలో ఉన్నట్లు గజదొంగలు, స్మగ్లర్లు, ఎర్రచందనం దొంగలు, గంజాయి సప్లయర్లు, హంతకులు, గూండాలు, భూకబ్జా దారులు జనసేనలో ఉండరన్నారు. సమాజం పట్ల ప్రేమ, దేశం పట్ల భక్తి గుండెల నిండా నింపుకున్న వ్యక్తుల సమూహంతో జనసేన ముందుకు సాగుతుందని పార్వతినాయుడు అన్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రకుంట మల్లిక మాట్లాడుతూ గాజు గ్లాస్ గుర్తుని పోలిన మరో గుర్తుని కూడా ఎన్నికల పోటీలో ఉండేలా వైసీపీ కుట్రలు చేస్తుందని , ఇలాంటి కుట్రలను జనసేన పార్టీ శ్రేణులు దీటుగా తిప్పికొట్టాలని కోరారు. ప్రతీ ఇంటికి వెళ్లి గాజు గ్లాస్ గుర్తుపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కలిగేలా ప్రతీ జనసైనికుడు, వీరమహిళ కృషి చేయాలని మల్లిక కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రాజనాల నాగలక్ష్మి, రెల్లి నేత సోమి ఉదయ్ కుమార్, నగర ఉపాధ్యక్షుడు కొండూరి కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి యడ్ల నాగ మల్లేశ్వరరావు, మెహబూబ్ బాషా, కొత్తకోట ప్రసాద్, బందెల నవీన్, వీరమహిళలు సవరం రాజ్యలక్ష్మి, సామ్రాజ్యం, జనసైనికులు కోలా అంజి, నండూరి స్వామి , పీ రమేష్ , కొలసాని బాలకృష్ణ , కుమారస్వామి, చంటి, బాలకృష్ణ, ఏడుకొండలు, పులిగడ్డ గోపి, విజయలక్ష్మి, పద్మ , విజయకుమారి, బాషా, రఘు, అలా కాసులు తదితరులు పాల్గొన్నారు.