అనంతపురం ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేపడుతున్న పలు నిరసన కార్యక్రమాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొంటున్న విషయం విధితమే. అందులో భాగంగా గురువారం సాయంత్రం టిడిపి నాయకులు స్థానిక సప్తగిరి సర్కిల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని సంకల్పించిన నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ సూచనల మేరకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న జనసేన నాయకులను, వీరమహిళలను పోలీసులు స్థానిక సప్తగిరి సర్కిల్ కార్యాలయం వద్ద అడ్డగించి అరెస్టు చేశారు. జనసేన నాయకులు, వీరమహిళలు ప్రతిఘటించడంతో పోలీసులు నాయకులు మధ్య కాసేపు వాగ్వివాదం తోపులాట జరిగింది. అయినప్పటికీ పోలీసులు వారిని ఐచర్ వాహనం తెప్పించి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అనిచివేయలేరని జనసేన నాయకులు మరియు వీరమహిళలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అరెస్టు అయిన వారిలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, రాపా ధనుంజయ్, జయమ్మ, నగర ప్రధాన కార్యదర్శిలు మేదర వెంకటేష్, కార్యదర్శులు అంజి, ఆకుల అశోక్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్, మరియు నాయకులు తాతయ్య, వీరమహిళలు అనసూయ, దాసరి సరిత ఉన్నారు.