రాజానగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు, సమాజం కోసం ఆయన పడుతున్న తపన, అలానే రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ సమర్థవంతమైన నాయకత్వం, ప్రజల కోసం నిలబడుతున్న తీరు, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి కోరుకొండ మండలం గరగలంపాలెం గ్రామానికి చెందిన ఇతర పార్టీ నేతలు ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన కండువా వేసి మర్యాద పూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. జనసేన పార్టీలో చేరిన వారిలో బండారు వెంకన్నబాబు, పడాల వీరబాబు, రాపర్తి శ్రీనివాసు, రాపర్తి వెంకటరామారావు, దండిపాటి ప్రసాద్, బండారు వెంకటేష్, కానెం వెంకన్న, కొండ్రపు రమేష్, బండారు శివ, తీగల దుర్గ ప్రసాద్, గొల్లకోటి రాము, గొల్లకోటి అరవింద్, రాయుడు శ్రీనివాస్, పెద్దాడ చందు, రెలుసు నరేష్, మరుకుర్తి హరీష్, మరకుర్తి సుబ్రహ్మణ్యం, రేమ్యలేసు నరేష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.