జగ్గంపేట ( జనస్వరం ) : గోకవరం మండలం శివరామపట్నం గ్రామంలో జనసేన పార్టీ సిద్దాంతాలు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ లక్షణాలు మరియు ఆయన రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్న విధానాలు నచ్చి వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరిన పలువురు నాయకులు, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానం పలికిన నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. వైసీపీ నుండి ఇరటా దుర్గాప్రసాద్, మరియు తమ్మిసెట్టి వీరబాబు, జోకా గోవిందు, తొలేటి అర్జున్, గాబు వీరబాబు, ములగాడ బాబ్జీ, సోమాల రామరాజు, రేపల్లె సురేష్ వారి బందు మిత్ర పరివారముతో వినాయక చవితి పండుగ రోజున ఎంతో సంతోషంగా జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే విధంగా ఇక్కడ మా జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర గారు కూడా గత నాలుగు సంవత్సరాలుగా రేయింబవళ్ళు ఎంతో శ్రమిస్తూ తన సొంత ఇంటికి కూడా వెళ్లకుండా నియోజకవర్గంలోనీ ప్రతి ఇంటికి తిరుగుతూ అదే గ్రామాలలో ఉండే దేవాలయాలలో నిద్రిస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేశారని అన్నారు. అలా ఆయన తన భార్య శ్రీదేవి గారితో కలిసి ఇప్పటికే నియోజకవర్గం మొత్తం 5 సార్లు పర్యటించి ప్రజల సమస్యలు తీరుస్తున్న విధానం కూడా మాకు చాలా బాగా నచ్చి మేము అంతా కలిసి జనసేన పార్టీ చేరడం జరిగిందని అన్నారు.