అనంతపురం ( జనస్వరం ) : అనంత ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కాపులకు ద్రోహం చేశారంటున్నారు. మీరు చేసిన మంచి ఏందో చెప్పండి? అంటూ జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ జనరల్ కేటగిరికి కేటాయింపబడిన అనంతపురం మేయర్ పదవిని మీరు కాపు కులానికి, రెడ్ల కులానికి ఇవ్వకుండా… రెండు కులాలకు ద్రోహం చేసింది వాస్తవం కాదా? జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ అధ్యక్షులు గురించి తర్వాత మాట్లాడుకుందాం… ముందుగా అనంతపురం క్లాక్ టవర్ బ్రిడ్జి దగ్గర సర్వీస్ రోడ్డుకు మరమ్మత్తు చేపించు నాయనా! ప్రతిరోజు నగర ప్రజలు సర్వీస్ రోడ్లో వెళ్లాలంటే నరకం చూస్తున్నారు. జనసేన పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే జనసేన పార్టీ నాయకుల ఫోన్లకు 10 నెంబర్లు ఉంటాయి. 9 నెంబర్లు ఉండవు. నీవు ఎన్నికల ముందర ఇచ్చిన హామీలు నేటి వరకు నెరవేర్చలేదు… అండర్ డ్రైనేజ్ సిస్టం అన్నావు! అనంతపురం పట్టణంలో చేయించావా? డంపింగ్ యార్డ్ తరలిస్తానన్నావ్! తరలించావా? వైసిపి జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య గారు మీరు ఏ-సేన? గంటకు ఒక పార్టీ మారే మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు ఏ పార్టీలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మీ పార్టీ గెలుస్తుంది అంటున్నావ్? మరి మీరు ఎందుకు 2019లో ఓడిపోయారు? ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన సందర్భంలో మాత్రమే రాష్ట్రానికి మీరు హోం మంత్రిని రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. మిగతా సమయంలో రాష్ట్ర ప్రజల మిమ్మల్ని మర్చిపోతున్నారు? ఏ రోజైనా నీ శాఖకు సంబంధించిన విస్తృతస్థాయి సమావేశం జరిపి నీ శాఖ పురోగతిని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారా ? నీతిమాలిన మాటలు మాట్లాడే వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేలలందరికీ ఇదే హెచ్చరిక… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ ప్రాంతాల్లో చేసిన అభివృద్ధిని తెలియజేసి ప్రజలను మెప్పిచ్చి ఒప్పించి ఓట్లు వేయించుకొని వచ్చే ఎన్నికల్లో గెలవండి? ఎందుకు ఇతర పార్టీలపైన పడి ఏడుస్తారు? అని అన్నారు.