ఏలూరు ( జనస్వరం ) : సీఎం జగన్మోహన్ రెడ్డి, తన మంత్రివర్గం, అధికారులు కుమ్మక్కై దోచుకు తింటూ అరాచకంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి రాష్ట్ర ప్రజల్లో చైతన్యాన్ని, పక్క రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులతో పాటు ఐటీ ఉద్యోగుల్లో కదలిక తీసుకువచ్చిన ఘనత మూర్ఖుడైన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.. రాష్ట్రాన్ని రక్షించాలంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసివచ్చే బిజెపి, ఇతర పార్టీలను కలుపుకొని ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపాలని, రాష్ట్రాన్ని కాపాడాలని, రాష్ట్ర ప్రజలను, ప్రజల హక్కులను రక్షించాలని, ప్రజల ఆస్తులను కాపాడి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆకాంక్షతో పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రభుత్వంపై పోరాడుతున్నారని చెప్పారు.. ఒక పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిని దశ, దిశ, విజన్ ఉన్న నాయకుడిని, అక్రమ కేసులు, పెట్టి జైల్లో ఉంచి ఈ అరాచక ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తుంటే… నేనున్నానంటూ, ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి కలిసికట్టుగా పని చేద్దామని, దుర్మార్గులను జైలుకు పంపిద్దామనే నినాదంతో సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత వచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని బహిరంగంగా ప్రకటించారన్నారు. పదవులు ముఖ్యం కాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండడమే ముఖ్యమని, రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని, భవిష్యత్తు తరానికి మంచి వేదిక, మంచి పాలన అందించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ మాట్లాడి టిడిపికి మద్దతు ప్రకటించారన్నారు..
పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులందరూ స్వాగతిస్తున్నామని, ఆనందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు, వారి కుటుంబం, టిడిపి సంక్షోభంలో ఉన్నప్పుడు, కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు బహిరంగంగా వచ్చి ధైర్యంగా నేనున్నాను నిజాయితీగా మనం కలిసి ముందుకు వెళ్దాం, అక్రమ కేసులను నివారిద్దాం అంటూ పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రజలందరూ అభినందిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో దుర్మార్గులైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సీఎంతో కలిపి మూట కట్టి గంగా నదిలో కలిపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడును పరామర్శించి, టిడిపికి మద్దతు ప్రకటిస్తే కొంత మంది పోరంబోకులు చట్టసభల ద్వారా ఎన్నికైన నాయకులు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఆరోపిస్తున్నారన్నారు. ప్యాకేజీ మాట్లాడుకునే టైములో ఈ పోరంబోకు నా కొడుకులు అక్కడ ఉన్నారా అని రెడ్డి అప్పలనాయుడు నిలదీశారు. అలాగే కొన్ని బొమ్మలు కూడా మాట్లాడుతున్నాయని, లిపిస్టిక్ కొట్టుకొని ఎందుకూ పనికిరాని బొమ్మ డైమండ్ రాణి మాట్లాడుతుందని ఈ బొమ్మతో పాటు ఇలాంటి వెధవలందరినీ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ నాయకత్వం మొత్తం కూర్చుని ప్రణాళిక తయారు చేస్తుందన్నారు. దాని ప్రకారం తాము టిడిపితో కలిసి సమిష్టిగా రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. మూర్ఖపు ముఖ్యమంత్రి అక్రమ అరెస్టులు ఆపి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ,అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్, నగర కార్యదర్శి కుర్మా సరళ,2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, సంయుక్త కార్యదర్శులు ప్రమీల రాణి,బీబీ, గాయత్రి ప్రోగ్రాం కమిటీ సభ్యులు బొండా రాము నాయుడు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చిత్రి శివ, నాయకులు మైలవరపు బెనహర్ తదితరులు పాల్గొన్నారు..