తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : చంద్రబాబు నాయుడు గారి అక్రమంగా అరెస్ట్ చేసిన వైసీపీ పార్టీ తీరును నిరసిస్తూ శుక్రవారం రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల శిబిరం దగ్గరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలతో పాల్గొనీ తెలుగుదేశం పార్టీ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్రజాస్వామికమని మండిపడ్డారు. గతంలో విశాఖలోని మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వైసీపీ ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ పని తీరుతో రాష్ట్రాన్ని నెగిటివ్ గ్రోత్‌లోకి నెట్టేశారనీ ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారిని అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ పేరుతో చంద్రబాబు గారిని అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత వ్యవహార శైలికి పరాకాష్టగా నిలుస్తుందని శ్రీనివాస్ చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించి, మాట్లాడే విపక్షాల గొంత నొక్కేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, పాలనా వ్యవస్థలను వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటుందని వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
దేశంలో జీ 20 సదస్సు వైభవంగా జరుగుతుంటే రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఎలా తీసుకొని రావాలి, పరిశ్రమలు ఎలా రప్పించాలి అని ఆలోచించాల్సిన ప్రభుత్వం విపక్షాలపై అడ్డగోలుగా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందనీ అన్నారు. అంతే కాకుండా రేపు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారని కాగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, ప్రతిపక్షాలపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపై ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు,జిల్లా అధ్యక్షులు మరియు జనసేన ఇన్చార్జ్ లతో ప్రత్యేక సమావేశం ఉంటుందని రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను జనసేన పార్టీ ఎలా ఎదుర్కోవాలి ప్రస్తుత రాజకీయ సంక్షోభంలో పార్టీ తీసుకోవలసిన స్టాండ్ పోత్తులతో జనసేన పార్టీ ముందుకు ఎలా సాగాలో పవన్ కళ్యాణ్ గారు నాయకులకు దిశా నిర్దేశం చేస్తారని బొలిశెట్టి శ్రీనివాస్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణి కుమార్, జిల్లా కార్యదర్శి కేశవబట్ల విజయ్, అధికార ప్రతినిధి సజ్జ సుబ్బు, దళిత నాయకులు చాపల రమేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్, జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, నీలపాల దినేష్ యాదవ్, మట్టా రామకృష్ణ, లింగం శ్రీను, మద్దాల నరసింహ, గట్టిం నాని, దాగారపు శ్రీను, ఏపూరి సాయి, skవల్లి, సతీష్, సంతోష్, బాలకృష్ణ, పిడుగు మోహన్ బ్రదర్స్, పాలూరి బురయ్య, రౌతు సోమరాజు, స్వామీ నాయుడు, మలకపాక చిట్టి, పాలూరి సందీప్, శ్రీ రామ్, భార్గవ్ వీర మహిళలు తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్యక్షురాలు వెజ్జు రత్న కుమారి, పెంటపాడు మండలం అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, అడపా జమున, ముద్దాల చిన్ని, తల్లాడి మధుమతి, సామినేని సత్యవతి, చాంద్ బేబి, తోట రాణి తదితరులు పాల్గొన్నారు.