ధర్మవరం ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ను, నాయకులను మరియు జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడంతో విషయం తెలుసుకున్న చిలకం మధుసూదన్ రెడ్డి విజయవాడ నుంచి నేరుగా ధర్మవరం పోలీస్ స్టేషన్ కు విచ్చేసి వారిని పరామర్శించడం సంఘీభావం తెలియజేయడం జరిగింది. అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి, జనసేన నాయకులు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీస్ సిబ్బందిని ఉపయోగించుకుని ఈ ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తొందరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ వైసీపీ పార్టీ వాళ్లు అపహస్యం చేస్తున్నారని విమర్శించారు.