ఆళ్లగడ్డ ( జనస్వరం ) : మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన బందుకు మద్దతు తెలుపుతూ నాలుగు రోడ్లో సర్కిల్ లో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేసిన ఆళ్లగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన నాయకులను పోలీసులు ఆరెస్ట్ చేసి పోలీస్ స్టేషనకు తరలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 74 సంవత్సరాలు వయసు ఉన్న ఒక వ్యక్తిని రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడాన్ని మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయవాడకు వెళ్లకుండా అర్ధరాత్రి పోలీసులు ఆయనను అడ్డుకోవడాన్ని వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండించారు. 2024 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రజా ప్రభుత్వం స్థాపించబోతున్నామని ఇప్పుడు వైసీపీ నాయకులు వేసిన తప్పులు అవినీతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు వెంకటసుబ్బయ్య, మహబూబ్ దౌల, ఆంజనేయులు, కేశవ, ఓబుళపతి, సజ్జల నాగేంద్ర, ప్రతాప్, తిమ్మరాజు యాదవ్, మంగమ్మగారి ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.