హోల్ సేల్ పూలమార్కెట్లో అర్జెంటుగా 3 షాపుల నిర్మాణం ఎవరికోసం ???

హోల్ సేల్

        విజయవాడ ( జనస్వరం ) : స్థానిక డివిజన్ అధ్యక్షులు శీగినంశెట్టి. రాముగుప్తా తో కలిసి హోల్ సేల్ పూల మార్కెట్ ను సందర్శించిన జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. నిర్మాణం జరుగుతున్న మూడు షాపులు నిర్మించే ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం మహేష్ మాట్లాడుతూ హోల్ సేల్ పూల మార్కెట్లో 3 షాపుల నిర్మాణం ఇంత అర్జెంటుగా ఎందుకు చేపట్టారని ?ఈ 3 షాపులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాదని ముందే గ్రహించి స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఒక షాపు మేయర్ భాగ్యలక్ష్మి గారికి రెండో షాపు మరి మూడోషాపు ఎవరికో వెల్లంపల్లి శ్రీనివాస రావే సమాధానం చెప్పాలన్నారు. వియంసి వారికి ఆదాయం కోసమే ఈ మూడు షాపులు నిర్మాణం చేస్తుంటే ఇందుకుగాను ఒక్కొక్క షాపుకు నెలకు 4500 చొప్పున 13,500 రూపాయలను వియంసి వారికి చెల్లించేందుకు హోల్ సేల్ పూలవర్తక సంఘం సిద్ధంగా ఉందని తక్షణమే వారిని వియంసి కమిషనర్ గారు చర్చలకు పిలిచి సమస్యకు సానుకూలమైన పరిష్కారం చూపాలని అన్నారు. ఈ మూడు షాపులు ఇక్కడ నిర్మాణం చేయడం వలన పూల లోడింగ్ అన్ లోడింగ్ తో పాటు పార్కింగ్ సమస్య తలెత్తుతుందని పండగలు రోజున ఈ ప్రాంతంలో నడిచేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని ఏదైనా పండుగనాడు ఒక టెంట్ వేసుకొని పూజా కార్యక్రమం నిర్వహించాలన్న ఇకనుండి కుదరదని, vmc వారి సొంత స్థలంలో కూడా రెండు రోజుల వరస సెలవు దినాల్లో ఇలా మూడు షాపులు నిర్మించడం వెనక అంతరార్థం ఏంటో సమాధానం చెప్పాలని, హోల్ సేల్ పూల వర్తక సంఘంలో ఉన్న 85 మంది కార్పొరేషన్ వారికి ఆ మూడు షాపులకు సంబంధించిన అద్దెలు 13,500 చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నందున తక్షణమే కమీషనర్ గారు వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, భావిశెట్టి శ్రీనివాస్, నగేష్ ,భాను , మున్న అఖిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way