గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : వెదురు కుప్పం మండలం, పచ్చికాపల్లంలో జనసేన బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెదురుకుప్పం మండలాన్ని, కార్వేటి నగరం మండలం తిరుపతి జిల్లాలో కలపాలని నినాదాలు చేశారు. ఈ పార్టీకి తిరుపతి జిల్లాలో ఉండాల్సిన రెండు మండలాలు, నారాయణస్వామికి ఉన్న స్వార్థం, స్వప్రయోజనం ఆ తరువాత ముద్రించాల్సిన రాజ పత్రాన్ని ఆపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మాటికీ నారాయణస్వామి స్వార్థపరుడు, స్వప్రయోజకారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజ్యాధికారాన్ని కుటుంబానికి ఇవ్వాలని తాపత్రయ పడుతున్నారు. అంతిమ అధికరాన్ని ప్రజల చేతికి ఇవ్వాలని చూస్తుంది జనసేన పరితపిస్తోందని తెలిపారు. వెదురు కుప్పం, కార్వేటినగరం మండలాల ప్రజలు అప్రమత్తం కావాలని, అవసరమైతే నిరసనలు, నిరాహార దీక్షలు చేయాలని, తిరుపతి జిల్లాలో కలిపి ఎంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రెండు మండలాలకు న్యాయం చేయాలని, వాటిని తిరుపతి జిల్లాలో కలపాలని, తుడా పరిధిలో ఉన్న మండలాలు, తిరుపతిలో కలిపి అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక ఎంపీపీ ఒక డమ్మీ, స్థానిక జడ్పిటిసి ఒక అసమర్థులని, కార్వేటి నగరం ఎంపీపీ దృశ్య రూపక పరికరమని, జడ్పిటిసి ఒక అదృశ్య రూపకమని తీవ్రంగా విమర్శించారు. ప్రజా క్షేమాన్ని గాలికొదిలేసిన వీరు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండు మండలాల ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించి, ఉపముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకువచ్చి, వెదురుకుప్పం కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి తిరుపతి జిల్లాలో కలిపి మండల ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా చేసి వెదురుకుప్పం మండల రుణం తీర్చుకోవాలని కోరారు. నారాయణస్వామి వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బిజెపి చిత్తూరు జిల్లా స్టేట్ కౌన్సిల్ మెంబర్ హనుమంత్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గోవింద్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ కుమార్ రెడ్డి, పంచాయతీ బూత్ కమిటీ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బెనర్జీ, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.