Search
Close this search box.
Search
Close this search box.

వాట్సాప్‌లో హెచ్‌డీ వీడియోలు పంపే ఆప్షన్.. ప్రాసెస్ ఇదే..

వాట్సాప్‌

       ఇంతకుముందు వాట్సాప్‌ (WhatsApp)లో పంపించే ఫొటోలు చాలా కంప్రెస్‌ అయి లో-క్వాలిటీలో సెండ్ అయ్యేవి. కాగా ఇటీవలే పెద్దగా కంప్రెస్‌ కాకుండా HD క్వాలిటీతో ఫొటోలు పంపించుకునే సదుపాయాన్ని వాట్సాప్ అందించింది. అదే సందర్భంగా HD వీడియోలు పంపించుకునే ఆప్షన్ కూడా పరిచయం చేస్తామని తెలిపింది. ఆ మాట ప్రకారమే వాట్సాప్ ఇప్పుడు HD రిజల్యూషన్‌తో వీడియోలను సెండ్ చేసుకునేలా కొత్త HD వీడియో షేరింగ్ (HD Video sharing) ఫీచర్ విడుదల చేయడం ప్రారంభించింది. దాంతో ఇప్పుడు హైక్వాలిటీ వీడియోలను వాట్సాప్‌లో పంపించేటప్పుడు షేరింగ్/ప్రివ్యూ పేజీలో HD అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే వీడియోల రిజల్యూషన్‌ ఏమాత్రం తగ్గకుండా షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే రిలీజ్ అవుతోంది. iOS యూజర్లు త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

          గతంలో వాట్సాప్ స్పీడ్ లోడింగ్, లో-డేటా consumption కోసం అన్ని వీడియోలను తక్కువ రిజల్యూషన్‌లో పంపేది. కానీ ఇప్పుడు హై రిజల్యూషన్‌లో HD వీడియోలను పంపడాన్ని అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ 2.23.17.74 అప్‌డేట్‌తో గురువారం నుంచి ఈ స్పెసిఫికేషన్‌ను అందుబాటులోకి తెస్తోంది. కాంటాక్ట్‌లతో షేర్ చేయడానికి వీడియోను ఎంచుకున్నప్పుడు యాప్ ఇప్పుడు స్క్రీన్ పైభాగంలో HD ఐకాన్ చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసినప్పుడు స్టాండర్డ్ (డిఫాల్ట్-480p రిజల్యూషన్‌), HD (720p రిజల్యూషన్‌) క్వాలిటీ ఆప్షన్స్ కనిపిస్తాయి. HD క్వాలిటీపై ట్యాప్ చేసినప్పుడు వీడియో HD క్వాలిటీతో వెళ్తున్నట్టు వీడియో సెట్‌-టు-హెచ్‌డీ అని స్మాల్ మెసేజ్ కనిపిస్తుంది. చివరగా సెండ్ బటన్‌పై నొక్కితే సరిపోతుంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ కొత్త అప్‌డేట్ పొందేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.  HD వీడియోలు ఎలా పంపాలి? – వాట్సాప్‌లో ఏదైనా ఒక చాట్‌ ఓపెన్ చేసి, అటాచ్‌మెంట్ ఐకాన్> గ్యాలరీపై ట్యాప్ చేయాలి. పంపాలనుకుంటున్న వీడియోను లొకేట్ చేసి, ప్రివ్యూను చూడటానికి దానిపై నొక్కాలి.

– స్క్రీన్ పైభాగంలో, స్టిక్కర్, టెక్స్ట్, డ్రాయింగ్ ఐకాన్స్‌కు లెఫ్ట్ సైడ్ HD ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి. HD క్వాలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ సైజు పెరిగినట్లు గమనిస్తారు. వీడియోలో ఏవైనా మార్పులు లేదా ఎడిటింగ్స్ చేశాక, బాటమ్ రైట్ కార్నర్‌లో ఉన్న Send బటన్‌పై క్లిక్ చేయాలి. HD వీడియోలు మంచి క్వాలిటీ, క్లియర్ & షార్ప్ విజువల్స్‌ కలిగి ఉంటాయి, కానీ అవి లార్జ్ డేటా సైజు ఉంటాయి, పంపడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. వాట్సాప్ ఇటీవల షార్ట్ వీడియో మెసేజెస్ పంపించుకునే మరో కొత్త ఫీచర్ కూడా పరిచయం చేసింది. వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఆప్షన్ సైతం అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రగ్యాన్‌ రోవర్‌
చంద్రుడిపై ప్రగ్యాన్‌ రోవర్‌ మూన్‌ వాక్‌.. రహస్యాల వేటలోప్రగ్యాన్‌..
ఫోన్ ఛార్జింగ్
ఫోన్ ఛార్జింగ్ చేయాలా.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తే మాత్రం..
Redmi
సగం కంటే తక్కువ ధరకే, Redmi ఫైర్ టీవీ! ఆఫర్ ధర, సేల్ వివరాలు
జియో
రోజూ 2జీబీ డేటా కావాలా? జియో ప్లాన్స్ ఇవే... నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way