కళ్ళ కలక వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి

కళ్ళ కలక

      ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కళ్ల కలక కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి దెబ్బకి అందరూ భయపడిపోతున్నారు. ముఖ్యంగా చాలా తొందరగా ఈ వ్యాధి అందరికీ సోకుతోంది. అయితే ఈ కళ్ల కలక ఎలా వ్యాపిస్తుంది ఇది వచ్చినపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం చాలామందికి తెలియదు. కళ్ల కలక వైరస్‌ లేదా బ్యాక్టీరియా అలర్జీ కారణంగా వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గుంపులు గుంపులుగా ఉండే ప్రదేశాల్లో ఈ కళ్ల కలక వ్యాధి అధికంగా వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఉన్నాయి.​ కళ్లకలకలు వాతావరణ పరిస్థితుల్లో మార్పు కారణంగా వస్తాయి. ఇన్ఫెక్షన్‌ ఉన్న వ్యక్తి నుంచి ఆ వైరస్‌ ఇతర వ్యక్తులకు కంటి స్రావాలు, చేతుల ద్వారా చేరుతుంది. ఎక్కువ శాతం చేతులు కళ్లలో పెట్టుకోవడం ద్వారా సోకుతుంది. ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్‌లో ఉండే వైరస్‌, బ్యాక్టీరియా ఇతరుల కళ్లలోకి చేరడం ద్వారా ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. కాంటాక్టు లెన్స్‌ వినియోగించే అలవాటు ఉన్నవారు వాటిని సక్రమంగా శుభ్రం చేసుకోవాలి. సరైన లెన్స్‌ వాడకపోవడం వల్ల కూడా కళ్ల కలక రావచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌ వల్ల వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి. రసాయనాలు, వాహనాల పొగ, సౌందర్య ఉత్పత్తుల వాడకం వల్ల కూడా వ్యాపిస్తాయి. అలర్జీ, దుమ్ము ధూళి, పెంపుడు జంతువులు, పూల పుప్పొడి ద్వారా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులపాటు ఇది ఉంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అన్న విషయానికి వస్తే…

          కళ్లు ఎర్రగా మారి నీరు కారడం, మండిపోవడం, కళ్లల్లో దురద, చికాకుగా ఉండడం, పుసులు కట్టి అంటుకుపోవడం, చిన్న పిల్లల్లో స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశం. ఒక కన్ను లేదా రెండు కండ్లు ఎర్రగా మారడం. కళ్లలో మంట, నొప్పి, దురద ఉండటం. కనురెప్పలు వాపు రావడం. కంటిరెప్పలు అతుక్కోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం , కళ్ల నుంచి నీరు లేక చిక్కటి స్రావం కారడం, కండ్ల కలకకు కారణమైన వైరస్‌తో సాధారణ జలుబు కూడా వస్తుంది. అయితే లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం, కళ్లపై చేతులు పెట్టకూడదు.శుభ్రమైన టిష్యూ కాగితం, చేతి గుడ్డతో కండ్లు తరచూ తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకుంటే లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. వేడిచేసి చల్లార్చిన నీటితో కళ్లు శుభ్రం చేసుకోవాలి. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటిబయాటిక్స్‌ చుక్కల మందులు వాడాలి. కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకునేవారు వాటిని మానేయాలి. వైరస్‌ వల్ల కలిగే సమస్య ఒకట్రెండు వారాల్లో తగ్గిపోతుంది. బ్యాక్టీరియాతో సమస్య ఏర్పడితే మెడిసిన్‌ కచ్చితంగా తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

చీకటి గది
ఏంటి! చీకటి గదిలో పడుకోవడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?
కాఫీ
కాఫీ తాగితే త్వరగా బరువు తగ్గుతారు! కేవలం ఒక ప్రత్యేక పద్ధతిలో మాత్రమే...
వెన్నునొప్పి
వెన్నునొప్పి తరచూ బాధిస్తోందా?
కొలెస్ట్రాల్‌
ఈ 6 ఆహారపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way