పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండల కేంద్రంగా ఇటీవల జనసేన పార్టీలో చేరిన గిరిజన నేత, మాజీ జెడ్పిటిసి నిమ్మల నిబ్రామ్ గారి పరిచయ వేదిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ పరిచయ వేదిక వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామం దేవత ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ర్యాలీగావెళ్లి జనసేన సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. నడిమికెళ్ల ఆంజనేయ స్వామి ఆలయంలో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా విక్రమపురం సంతోషి మాత ఆలయాన్ని సందర్శించి, నడుకూరులో ఆంజనేయ స్వామి ఆలయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ నుంచి నేరుగా వీరఘట్టం మండల కేంద్రo అంబేద్కర్ జంక్షన్ కి చేరుకుని ప్రజలను ఉద్దేశించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు తనకు నచ్చి ఈ పార్టీలో చేరానని ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలు చేరేలా చూస్తానని, ఒక జనసైనికుడులా పాలకొండ నియోజకవర్గంలో పనిచేసి ప్రతిపక్షాలకు దీటుగా ఉండే విధంగా జనసేన పార్టీని తీర్చిదిద్దుతానని ఈ సభ వేదికగా ప్రజలను ఉద్దేశించి నిమ్మల నిబ్రాంగారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాలుగు మండలాల నాయకులు జనసైనికులు పాల్గొని జై జనసేన అని నినాదాలు చేస్తూ హలో ఏపీ బై బై వైసిపి హలో ఏపీ – వెల్కమ్ జె. ఎస్.పి అనే నినాదాలుతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స.పుండరీకం, బి.పి.నాయుడు, కర్రి కల్యాణి, కర్ణేన సాయి పవన్, కోడి వెంకటరావు నాయుడు, జనసేన జాని, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జామి అనిల్, సింహాద్రి, దీపక్, కిరణ్, ప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.