విజయవాడ ( జనస్వరం ) : ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 50వ డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ గారి ఆధ్వర్యంలో గొల్లపాలెం గట్టు గూడెల రాంబాబు గారి వీధి వద్ద నుండి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన మహేష్ గారు పాల్గొని 50వ డివిజన్లోని కొండ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్తుంటే ప్రతీ చోట కూడా అనేక రకాల భాదలు చెప్తున్నారని, పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని,జగన్ మోహన్ రెడ్డి గారికి మంచి చేస్తారని ఒకసారి అవకాసం ఇస్తే మమ్మల్ని నట్టేట ముంచారనె అవేదన వ్యక్తం చేస్తున్నారని, నిత్యవసర ధరలు విద్యుత్ ఛార్జిలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు పెంచేసారని, జగన్ గారి పథకాల కన్నా పన్ను పోట్లు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తపరుస్తున్నారని, గతంలో చీప్ లిక్కర్ 50 రూపాయలు వుండేది ఇప్పుడు జగన్ గారి బ్రాండ్ కొనాలి అంటే 250 పెంచేశారని, కొంత మంది మద్యం సేవించేవారు మాతో చెప్పి అవేదన వ్యక్తం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన మేనిఫెస్టోను ప్రకటించారని,రాజధాని అమరావతిగానే వుండాలని, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి,పెట్టుపడులు,పరిశ్రమలు వస్తాయి కాబట్టి రాజధాని అమరావతి లోనే వుండాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారని, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇసుక ఇవ్వాలని, వ్యాపారాలు చేయాలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనుకునేటువంటి యువతకి వడ్డీ లేని 10లక్షల రూపాయల రుణ సహాయం అందజేయడం లాంటి అంశాలను జనసేన మేనిఫెస్టోలో పోందు పరిచారని, పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అన్నారు. నిన్న విజయవాడ నగరంలో విజయవాడ గడ్డ వైసిపి అడ్డా అంటూ ర్యాలీ నిర్వహించి బరితెగించి రోడ్లమీద ఇష్టానుసారం తిరుగుతూ కారుకూతలు కూస్తున్న వైసిపి నాయకుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నానని విజయవాడ నగరాన్ని క్రిమినల్స్ కి, కబ్జాదారులకి, అవినీతికి, గంజాయి,స్పా సెంటర్ లకి, అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మార్చింది వైసిపి నాయకులేనని దీనికి మీరు సమాధానం చెప్పాలని, ఈ రోజున ఆర్థిక నేరాలకు కేరాఫ్ గా విజయవాడ నగరాన్ని వైసీపీ నాయకులు మార్చేశారని, వీటన్నిటి మీద మీకు దమ్ముంటే మాతో బహిరంగ చర్చకు రావాలని నేను ఆధారాలతో నిరూపిస్తానని, నిన్న ఒక ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని దేవినేని అవినాష్ అనుచరులు అవినాష్ గారి దొడ్లోకి తీసుకెళ్లి కొడతారా అని మాకు న్యాయం చేయమని దేవినేని అవినాష్ ఇంటికి వెళ్తే దాడి చేస్తారని, మీ దొడ్లో జరిగిన దాడికి మీరే బాధ్యత వహించాలని అతనిపై దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని వైసిపి నాయకులు రౌడీయిజం గూండాయిజం విజయవాడ నగరంలో ప్రోత్సహిస్తే ప్రజలు ఉపేక్షించరని మిమ్మల్ని తరిమి కొడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో S.రాము గుప్తా, అడపాల వసంత కుమార్, మద్దెల కనకారావు, చిట్టి రమణ, ksn మూర్తి , తమ్మిన రఘు బాబు, పిళ్ళా రవికుమార్, ఏలూరి సాయి శరత్ , వేవిన నాగరాజు కొరగంజి వెంకటరమణ, హుస్సేన్, లింగం శివప్రసాద్, రెడ్డిపల్లి అనిత, మొబీనా, s.నరేష్, పిళ్ళా రవి, బోట్టా సాయికుమార్, రామిశెట్టి మురళి, తదితరులు పాల్గొన్నారు.