ఆచంట ( జనస్వరం ) : మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్బంగా ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో వల్లూరు గ్రామంలో కొబ్బరిమొక్కలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవి గారు చేసిన చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు స్పర్తిగా తీసుకుని మెగా ఫ్యామిలీ అభిమానులు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేయడం శుభపరిణామమని, మెగాఫ్యామిలీ ఎప్పుడు సమాజాశ్రేయస్సు కోసం నిరంతరం తాపత్రయం పడతారని, సమాజం మనకు ఏంచేసిందని కాదు మనం సమాజానికి ఏంచేశామన్నది ముఖ్యమని ఆలోచించే వ్యక్తి లు అన్నారు. అందుకే చిరంజీవి గారి అభిమానులు గా నిరంతరం గర్వపడుతున్నాని అన్నారు. ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రటరీ రావి హరీష్ గారు మాట్లాడుతూ చిరంజీవి గారు ఏర్పాటు చేసిన బ్లెడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవకార్యక్రమాలు ఈ రోజు ఎంతో మందికి చూపును ఇవ్వడమే కాకుండా ఎంతో మందికి ప్రాణ దాతగా నిలిచారాని, చిరంజీవి గారిని ఆదర్శం గా తీసుకుని యువత మరింతమంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండాలని యువతకు పిలునిచ్చారు. ఈ కార్యక్రమం లో జనసేనపార్టీ వల్లూరు గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరరావు, యలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు గారు, వల్లూరు సీనియర్ వైస్సార్సీపీ నాయుకులు పంది అప్పారావు గారు, టిడిపి నాయకులు చోగొండి నాగరాజు గారు, జనసేన నాయుకులు జనసేనపార్టీ ఆచంట మండలం సెక్రటరీ కాపవరపు రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పంపన శ్రీను, సీనియర్ జనసైనికులు కడిమి శ్రీనివాస్, ఇర్రింకి నాగరాజు, రుద్ర కాసు, ఇర్రింకి శ్రీను, ఏడిద బాలు, కట్టుంగ వెంకట ముత్యం, పంపన సాయి, కట్టుంగ హేమంత్, కడిమి శేఖర్, మొదలగువారు పాల్గొన్నారు.