నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం మండలం, మినగల్లు గ్రామంలో పాలతిప్ప వద్ద దాదాపు పది ఎకరాల కొండలను తవ్వి పల్లం చేశారు. ఇలా తవ్వుకుంటూ పోతే ఆ ప్రాంతమంతా లోయలు గా మారే అవకాశం ఉంది,గ్రావెల్ అక్రమ తవ్వకాలను ఆపించాలని కలెక్టర్ గారిని కోరాము. అదేవిధంగా దాదాపు 110ఇసుక రీచులను తవ్వకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉండగా,వాటిని బేఖాతరు చేస్తూ మినగల్లు గ్రామంలో డంపింగ్ యార్డ్ బిల్లును చూపించి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. వీటి విషయమై ఎమ్మార్వో, మైనింగ్, సెబ్ ఎవరిని అడిగినా ఒకరి మీద ఒకరు చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ అక్రమ మైనింగ్ మాత్రం ఇదేచ్ఛగా జరుగుతూనే ఉంది, సాయంత్రం 6 పైన ఉదయం ఏడు లోపల యుద్ధ ప్రాతిపదికన ఇసుక, గ్రావెల్ అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. వీటి గురించి ప్రశ్నిస్తే స్వయాన సర్పంచ్ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి స్థానికులు ఎంతో భయాందోళనలకు గురైనా చేసేది ఏమీ లేక మినక్కున్నారు. అక్రమార్జునే ధ్యేయంగా స్థానిక నాయకులు గతంలో వచ్చిన వరదల్లో పల్లెలు మునిగిపోయినా కూడా ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా తవ్వి సంపాదించుకుంటున్నారు. వీటి గురించి కలెక్టర్ గారికి,సెబ్,మైనింగ్,అధికారులకు రిపోర్ట్ చేస్తాం వారి నుంచి తగిన సమాధానం రాకపోతే కచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించి,జిల్లాలో సహజ వనరులు దోపిడీని అరికట్టేందుకు జనసేన పార్టీ తరఫున పోరాడుతాం అని తెలియజేశారు.