ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి నివాసంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులతో,కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి 18 ఏళ్లు నిండిన ప్రతి యువత కొత్త ఓట్లు ఎవరికైతే లేవో వారు నమోదు చేయించుకునే విధంగా పట్టణంలో మరియు గ్రామాలలో మీరు తిరిగి వారికి అవగాహన కల్పించి కొత్త ఓట్లు నమోదు చేయించుకునే విధంగా కృషి చేయాలని అలాగే ప్రతి ఒక్కరి ఓటు ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ వారి ఓటు తొలగిపోయి ఉంటే తిరిగి మరల నమోదు చేపించే విధంగా వారికి వివరించి నియోజకవర్గంలోని 15 వేల నుంచి 20 వేల ఓట్ల వరకు నమోదు చేసే విధంగా కృషి చేయాలని అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని ఉపయోగించుకొని జనసేన పార్టీ తరపున మనం చేస్తున్న కార్యక్రమాలు,ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని,మన కార్యక్రమాలు అన్ని విజయవంతం అయ్యే విధంగా విస్తృత ప్రచారం చేసి సోషల్ మీడియాను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు,కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు జనసేన పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.