కోవూరు ( జనస్వరం ) : ప్రభుత్వం భూములను కాజేస్తున్నారు అంటూ రాజు పాళెం,హై స్కూల్, సీలింగ్ భూమి వద్ద జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ బద్దెపూడి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అత్యాశ అనే సాఫ్ట్వేర్ మైండ్లో పెడుతున్నాడు. ఎవరినైనా దోచేసుకోవచ్చు లొంగదీసుకోవచ్చు,దౌర్జన్యం చేయొచ్చు అనే సాఫ్ట్వేర్ మైండ్ లో పెడుతున్నాడు. ప్రసన్నకుమార్ రెడ్డి గారు అభివృద్ధి సాధించలేని.. మీరు ఎమ్మెల్యేగా ఎందుకు కొనసాగటం..? పార్టీలు మారి గెలిచి ప్రజలనుద్దరించేదేమీ లేదు. ఇక మీరు పోటీ చేయకుండా అయితే బాగుంటుందని మా అభిప్రాయం. ప్రభుత్వ స్థలాలు ఖాళీగా దొరికితే వాటిని ఆక్రమించుకొని సొమ్ము చేసుకుంటున్నారు వైసిపి నాయకులు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరించడం దాడులు చేయడం జరుగుతుంది. ఎంతమందిని బెదిరిస్తారు ఎంతమంది ని కొడతారు. సమాజం మేల్కొంది ఒకరిద్దరినైతే బెదిరించే కొట్టి ఆపగలరు. విడోస్ హోమ్ ఫౌండేషన్ కింద ఏడెకరాల భూమిని సొంతానికి వైసీపీ నాయకులు వాడుకుంటున్నారు. ఈ రోజున హైస్కూల్ ఎదురుగా గల రెండు ఎకరాల 72 సెంట్లు భూమి లో సీలింగ్ చేసిన 72 సెంట్ల లో 40 సెంట్లు భూమిని అమ్మినట్టు చూపి సొమ్ము చేసుకున్నారు. ఈ స్థలంపై ఎమ్మార్వో గారు ఎవరికి బదిలీ చేయలేదు అని సర్వే చేసి లేక ఇచ్చి ఉన్నారు,ఈ స్థలం ప్రైవేట్ స్థలమా ప్రభుత్వ స్థలమా వైసిపి ప్రభుత్వం నిగ్గు చేర్చాలి. ఒకవేళ ప్రైవేటు స్థలమైతే ఆ భూమిని పూడ్చడానికి రూ.1,90,000 లు13 ఫైనాన్స్ కింద నిధులు పంచాయతీ నిధులు వాడడం జరిగింది. కాబట్టి అది ప్రభుత్వ స్థలం అనుకుంటే ప్రభుత్వ స్థలం అయినప్పుడు వేరొకరికి ఎలా బదిలీ చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో అడుగడుగునా దురాక్రమణ కనబడుతున్నాయి. రాజుపాలెం పరిధిలో టపాతోపు వద్ద,పంచాయతీ పక్కన,చంద్రబాబు నగర్ కాలనీ దగ్గర
మూడు గుంటలు ఉండగా చంద్రబాబు నగర్ కాలనీ దగ్గర ఉన్న గుంటని ప్రతి మూడేళ్లకు ఒకసారి పాట పెట్టి ఇవ్వాల్సి ఉండగా, ఒకేసారిగా 15 సంవత్సరాలకెలా లీజుకి ఎలా ఇచ్చారు. మిగిలిన రెండు గుంటల్ని ఎందుకు పూడ్చారు. సుప్రీంకోర్టు జీవో గుంట పోరంబోకులను పూడ్చడానికి వీలు లేదు అది నేరం అని తెలిపి ఉన్న పక్షంలో వాటిని ఏ విధంగా మీరు పూడుస్తారు. ఈ రోజు పూడ్చారు రెండు రోజుల తరువాత వేరే వారి పేరుకు మారుస్తారు, చేతులుమార్చి సొమ్ము చేసుకుంటున్నారు. పేదలకి ఆ రంకణాలు ఇల్లు ఇవ్వడానికి సంవత్సరాల ఆలోచించే ఈ వై సి పి పెత్తందారులు సొమ్ము చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతుంది.. ఈ విషయమై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము,జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం అవకుండా పోరాడుతామని తెలిపారు. గత ప్రభుత్వాలలో ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే సరి చేసుకోవడానికి ప్రయత్నించేవారు,ఇక్కడ వైసిపి నాయకులు అండదండలకు తో విచ్చలవిడితనం తిరిగిపోయి ఎవరైనా ప్రశ్నిస్తే వారి దుర్భాషలడు దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం కాపాడుకుంటా పోరాడుతామని తెలిపారు గతంలో ప్రభుత్వ అధికారులను గత ప్రభుత్వాలలో ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే సరి చేసుకోవడానికి ప్రయత్నించేవారు ఇక్కడ వైసిపి నాయకులు అండదండలకు తో విచ్చలవిడితనం తిరిగిపోయి ఎవరైనా ప్రశ్నిస్తే వారి దుర్భాషలడు దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. రాజుపాలెం పరిధిలో 2000 రూపాయలు ఇస్తే ఎవరి పేరు మీదనైనా ఇంటి పన్ను ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దీన్ని ప్రశ్నించినందుకు విలేకరిపై దురుసుగా ప్రవర్తించటమే కాక స్థానిక నాయకుడు చేత మిమ్మల్ని దండిస్తామని కూడా బెదిరిస్తున్నారు. కోవూరు నియోజకవర్గం లో ఎన్నో పంచాయతీలు ఈ విధంగానే పెత్తందారుల చేతిలో నలిగి పోతున్నాయి. కోవూరు పరిధిలో ఒక కాలీ ప్రభుత్వ స్థలంలో మట్టి తోలినట్లు కనబడితే అది ఎవరో కబ్జా చేస్తున్నారని తేలిగ్గా అర్దమైన ప్రజలకు ఒక గ్రూపుకు ఉన్న శక్తి తెలియడం లేదు..మీ అందరూ సామూహిక ప్రయోజనాల కోసం, పెత్తందారుల అక్రమాలు ఎదిరించేందుకు,ఈసారి పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సమాజం ను మేల్కొలిపి, వారి హక్కులను తెలుసుకొని జరుగుతున్న దురాక్రమణమై పోరాటం చేసే వరకు ప్రజలను తరపున నిలబడి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్ బద్దపూడి కార్యదర్శి, మడపర్తి ప్రశాంత్ గౌడ్ హేమచంద్ర యాదవ్, రఘు, ఖలీల్, షాజహన్, సాయి, షారు ఖాసిఫ్ తదితరులు పాల్గొన్నారు.