
ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో క్రియాశీలక వాలంటీర్లకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ దేశ చరిత్ర లో ఎన్నడు లేని విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించి తద్వారా వారి కుటుంబాల కు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని తెలియపరచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు పాత్రుని పాపారావు, మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్ గారు కొత్తకోట నాగేంద్ర ఎలకల రమణ, ఎంపీటీసీ అంపిలి విక్రమ్, కొంచాడ సూర్య, వీర గొట్టపు బాలమురళి, తదితరులు పాల్గొన్నారు.