గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్నంలో రోడ్లు మరమ్మత్తులు చేయాలన జనసైనికులు జోరు వర్షంలో మోకాలు మీద నిరసన కార్యక్రమం చేయడంతో వెంటనే స్పందించిన గుడివాడ మున్సిపాలిటీ సిబ్బంది కల్వర్టుకు మరమ్మత్తులు చేయడంతో ప్రజలు జనసైనికుల్ని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో రోడ్లు గుంతల మయం కావడంతో ప్రజలు మరియు వాహనదారులు ఇబ్బంది పడటంతో జోరు వర్షంలో మోకాలు మోకాలు మీద నిరసన కార్యక్రమం తెలియజేయడంతో వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి కల్వర్టును మరమ్మతులు చేసి గుంతలను పూడ్చడం జరిగింది అని వారికి గుడివాడ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, దివిలి సురేష్, చరణ్ తేజ్, గంటా శీను, మరియు జనసైనికులు పాల్గొన్నారు.