మైఫోర్స్ మహేష్ రిలే నిరాహారదీక్ష – ప్రభుత్వ స్పందన

– వచ్చే నెల 20 వ తేది లోగా వీధి దీపాలు, నీటి సమస్య పరిష్కారించక పోతే ఆమరణ నిరాహార దీక్ష
– జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్

   మదనపల్లి ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ చేపట్టిన రిలే నిరాహారదీక్షకు అధికార యంత్రంగంలో కదలిక వచ్చింది. ‌సోమవారం జనసేన పార్టీ ఆద్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీ అనపగుట్ట, చంద్ర కాలనీ, బి.కే.పల్లి వాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. నిరాహారదీక్ష చేపట్టడానికి ముందే డియాస్పీ కేశప్ప ఆద్వర్యంలో సిఐ మహబూబ్ బాషా, ఎస్ఐ హరిహర ప్రసాద్ పర్మిషన్ లేదంటూ మైక్ సెట్, కుర్చీలు తొలగించారు. ‌దీంతో కొంత సేపు రిలే నిరాహారదీక్ష జరుగుతుందా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ‌మైఫోర్స్ మహేష్ అక్కడికి విచ్చేసి రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. డియాస్పీ కేశప్ప ఆద్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రమిలా దీక్ష శిబిరం వద్దకు విచ్చేసి మైఫోర్స్ మహేష్, స్దానిక ప్రజలతో చర్చలు జరిపారు.‌ ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ కాలనీలో నెలకొన్న సమస్యలు నెల రోజుల కిందటే మీ దృష్టికి తీసుకు రావడం జరిగిందని, అయిన అధికారులు స్పందించలేదని ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలోని చంద్ర కాలనీ, అనపగుట్ట, మంజునాధ కాలనీ, బి.కె.పల్లిలో ఇంటికి మంచినీటి సౌకర్యం, రోడ్లు, మురికి నీటి కాలువలు ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ ను స్పష్టం చేశారు. మైఫోర్స్ మహేష్ ఆద్వర్యంలో చేపట్టిన జనం కోసమే జనసేన కార్యక్రమంలో ప్రత్యక్షంగా చూసిన సమస్యలను ఆయా కాలనీ వాసులతో కలిసి నెల రోజుల క్రితం పిర్యాదు చేయడం జరిగిందన్నారు. మురికినీటి కాలువలు ఏర్పాటు చేయాలని, ఇంటింటికి మంచినీరు సరఫరా చేయాలని, వీధులలో సిమెంటు రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.

– మైఫోర్స్ మహేష్ దీక్షకు స్పందించిన కమీషనర్ ‌ప్రమీలా
– రూ. 2.85 కోట్లతో అభివృద్ధి పనులంటూ కమీషనర్ ప్రకటన 
ఈ‌ సందర్భంగా రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద కమీషనర్ ప్రమిలా మాట్లాడుతూ కాలనీలోని సమస్యలను ప్రత్యక్షంగా చూడటం జరిగిందని, వాటిని పరిష్కారానికి మున్సిపల్ మీట్ లో చర్చించడం జరిగిందన్నారు. రూ.‌2.85 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు కల్పిస్తామని ప్రకటించారు. ‌అంతే కాకుండా అమృత్ పధకం కింద ఇంటింటికీ నీటి సౌకర్యం కల్పిస్తామని హామి ఇచ్చారు. దీనిపై మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ స్పష్టంగా ఏ తేదినా వీధి దీపాలు, నీటి సౌకర్యం కల్పిస్తారో స్పష్టమైన హామి ఇవ్వాలని పట్టుబట్టారు. ‌దీనిపై కమీషనర్ ప్రమిలా స్పందిస్తూ వచ్చేనెల 20 వ తేది లోగా నీరు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చరు. దీంతో‌ రిలే నిరాహారదీక్షను తాత్కాలికంగా విరమిస్తున్నామని మైఫోర్స్ మహేష్ ప్రకటించడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు ఊపిరి పిల్చుకున్నారు.‌ అయితే వచ్చె నెల 20 వ తేది లోగా సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో 21 వ తేది నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపడుతామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way