Search
Close this search box.
Search
Close this search box.

అవస్థలో విద్యా వ్యవస్థ

అవస్థలో విద్యా వ్యవస్థ

                ప్రతీ ఒక్కరూ ముందుగా రాజకీయాలను పక్కనబెట్టి ఒకసారి సామాజిక, ఆర్ధిక విషయాలపై దృష్టిపెడితే జరుగుతున్న పరిణామాలు, అవి ప్రజలపై మోపే భారాలు అర్ధమవుతాయి. అయితే ఇది అర్ధం చేసుకోవడానికి రాష్ట్ర పౌరుడి ఆలోచనా ధోరణిని కూడా మనం అవలోకనం చేసుకోవాలి. గతంతో పోల్చుకుంటే అక్షరాస్యత శాతం మెరుగుపడుతుందని చెప్పుకుంటున్న మనం ఆ అక్షరాస్యతలో నైపుణ్యం దాని ద్వారా లభించే సృజనాత్మకతను విస్మరించాం. ఇది సామాజిక కోణంలో కూడా చాలావరకూ అందోళన కలిగించే అంశంగా పరిణమిస్తుంది. ఇప్పటికే ఉపాధికల్పన విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరు, ప్రపంచీకరణలో వారి దేశ పౌరులకే ప్రాధాన్యతనిచ్చే కోణంలో జరిగే మార్పులు, దేశ ఆర్ధిక వనరులు వినియోగంపై సహేతుకమైన నిర్ణయాలలో వైఫల్యం కారణంగా మరింత ఎక్కువగా నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనదేశంలోని చాలా రాష్ట్రాలలో ప్రజల ఉపాధి కల్పన కన్నా పథకాలను ఎరగా చేసుకుని ఓటరుపై ఆర్థికకంగా ఆదుకుంటున్నామంటూ మభ్యపెట్టి తిరిగి ఆర్థికలోటును పూడ్చడానికి పన్నుల రూపంలోనో, చార్జీల పెంపు రూపంలోనో మరల ప్రజల నుండే వసూలు చేసేస్తూ ప్రజలు గ్రహించలేని విధంగా చేసి, గ్రహించినా తిరిగి ప్రశ్నించలేని విధంగా చేస్తున్నారు. ఇది ప్రజా సంక్షేమంగా మనం పరిగణించలేము కదా!! మనసుకు కష్టమైనా స్పష్టంగా చెప్పాలంటే ఇది క్షామం. దీనిని ప్రతీ పౌరుడూ తీక్షణంగా దేశ, రాష్ట్ర స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి రాబోవు తరాలకు ఈ పెనుముప్పు తప్పేటట్టుగా ఆలోచించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసివస్తుంది..
               ఒకసారి ఆ అంశాలలోకి వస్తే విద్యావ్యవస్థలో మార్పులకు బదులుగా, పిల్లల చదువులకోసం తలిదండ్రుల ఆర్ధిక స్థితిపైన భారం తగ్గించడానికి బదులుగా ఆర్ధికంగా ఆసరా అవుతున్నామనే నెపంతో వారికి పథకం పేరు మీద నగదు బదిలీ చేస్తున్నారు. చివరకు మాతృభాష బోధన విషయంలో కూడా ఆంగ్లం రాకపోవడం ఉపాధికి అవరోధమనే విషయంగా ప్రజలను ఏమార్చి మానసిక వికాసానికి దూరం చేస్తున్నారు. పాఠశాలలలో కనీస అవసరాలు, వారి సృజనాత్మకతకు దోహదపడేవిధంగా పాఠ్యాంశాల మార్పులు తీసుకువచ్చే ప్రణాళికలు లేకుండా తలిదండ్రుల ఓట్ల కోసం పిల్లల భవిష్యత్తుకు భరోసానివ్వలేని కార్యక్రమాలు చేపడుతున్నారు, అంతేగాక సరైన మరుగుదొడ్లు, ఆటస్థలం కూడా లేని పాఠశాలలు కోకొల్లలు. ఇటువంటి కనీస అవసరాలను తీర్చకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు పిల్లలకు ఏ విధంగా ఆసరా అవుతాయి. ఇప్పటికీ సాంప్రదాయబద్దమైన కోర్సులు లేదా ఇంజనీరింగ్ కోర్సులపైనే ఆసక్తి కనబరుస్తున్న ఈ తరుణంలో ఎక్కువ మంది ఈ తరుణంలో ఎక్కువ మంది అదే కోర్సులపై అదే కోర్సులపై మక్కువ చూపిస్తున్నప్పుడు ఎదురయ్యే అంశాలపై కూడా ప్రభుత్వాలు ఒక సహేతుకమైన విధివిధానాలు రూపొందించలేకుంటే ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పట్టభద్రులను సమాజం పొందలేదు. ఇప్పటికే చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోవడం ఒక వంతైతే చేస్తున్న పనికి, చదివిన చదువుకీ సంబంధం లేకుండా విధులు నిర్వర్తించడం ఒక వంతయ్యింది.   

            కేవలం ఉద్యోగం, తద్వార సంపాదనే ధ్యేయంగా చేసుకుని కొనసాగుతున్న ఈ విద్యావ్యవస్థలో సామాజిక న్యాయం, దేశ పౌరుడిగా నిర్వర్తించవలసిన కనీస ధర్మాలను విడిచిపెట్టేస్తున్నాం. క్రమశిక్షణను అలవరచలేని చదువులతో ఇటు తలిదండ్రులు, గురువులు, సమాజం కూడా అందోళన చెందే పరిస్థితులలోనికి మనకి మనంగా నెట్టివేయబడుతున్నాం. తల్లిదండ్రుల ఈ ధోరణే రేపటి వారి పిల్లలే వారిపై వృధ్యాపంలో చూపించే వివక్షకు కారణమవుతుంది. వృత్తి విద్యాకోర్సులను స్థాపించి నూతన ఆవిష్కరణలకు అవకాశాలను కల్పించాలి. అధ్యాపకుల ఎంపికలో జరుగుతున్న విధానాలను పునఃసమీక్ష చేసుకుని ఉత్తమ విద్య పిల్లలకు అందేటట్లుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. చదువు చెప్పేందుకు సిద్ధపడిన తర్వాత చదువుకునే రీతిగా సాగే ఇప్పటి అధ్యాపక విధానాలలో ఆ అధ్యాపకుడి ఉత్తీర్ణతా పరంపరలోని మార్కులను (గుణాలను) కూడా పరిగణలోనికి తీసుకోవాలి.  ఇక ఉపాధి విషయానికొస్తే నైపుణ్యత లేని పట్టాలు అందుకుని ఎంతో మంది యువత నిరుద్యోగులుగా జీవనాన్ని సాగిస్తున్నారు.గడిచిన 20 సం.రాలలో 10 వ తరగతి ఉత్తీర్ణతా శాతం 50 నుండి 90 వరకూ పెరిగినా నైపుణ్యతా శాతం అంత ఆశాజనకంగాలేదు, ఇంకా చెప్పాలంటే, తలిదండ్రులు కష్టమైనా 10+2 లో ప్రైవేట్ కాలేజీలలో చదివించడానికి మక్కువ చూపి వారి ఆర్ధిక పరిస్థితిని దిగజార్చుకుంటున్నారు. ఒక ఇంటిలో ఇద్దరు పిల్లలను చదివించడానికి నెలకు వారికి అయ్యే ఖర్చు ఆ కుటుంబ పోషణార్ధం నెలకు అయ్యే ఖర్చు రమారమీ సమానం. ఇటువంటి స్థితిలో ఆర్ధిక అసమానతలు రూపుమాపడం ఎవరివల్లా కూడా సాధ్యపడదు. ఎంతమంది ఈ ప్రైవేట్ కాలేజీలలోని విద్యార్ధులు ఉపాధి పొందుతున్నారనేది ప్రశ్నార్ధకమే. ప్రభుత్వాలు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కుమ్మక్కై ఈ పరిస్థితులకు బీజం వేసారు, ఆ పరిస్థితే ఇప్పడు నిర్వీర్యమైన సమాజానికి హేతువయ్యింది. ఇది గ్రహించే స్థితిలో తలిడండ్రులు లేరు. పూర్తిగా విద్యావ్యవస్థను మాయాజాలం చేసి ఉపాధి కల్పించలేని వారి పోకడలకు  రంగులు పూసి మభ్యపెట్టి కాలం వెల్లదీస్తున్నారు. ఈ ప్రమాదాన్ని అంచనా వేయగల సామర్ధ్యం గ్రహించే స్థితిలో తలిడండ్రులు లేరు. పూర్తిగా విద్యావ్యవస్థను మాయాజాలం చేసి ఉపాధి కల్పించలేని వారి పోకడలకు రంగులు పూసి మభ్యపెట్టి కాలం వెల్లదీస్తున్నారు. ఈ ప్రమాదాన్ని అంచనా వేయగల సామర్ధ్యం ప్రజలకు లేకుండా చేసి పథకాలు, కులం, మతం అనే స్వార్ధాల నీడలో వారి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ పరిస్థితిని చక్కబెట్టాలంటే ఒక యజ్ఞంగా కొన్ని సంవత్సరాలు సాగితే తప్ప ఈ రాబోయే భయంకర విపత్తుని ఎదుర్కోలేము. భయంకర విపత్తుని ఎదుర్కోలేము. రాజకీయనేతలే రాజ్యాంగేతర శక్తులుగా మారి దేశం, రాష్ట్రాల భవిష్యత్తుని అంధకారంలోనికి నెట్టేస్తున్నారు. దేశ సామాజిక, సాంప్రదాయాల విషయంలో విభిన్నమైనపోకడలు విద్యావ్యవస్థ పనితీరుపై ఎటువంటి ఆలోచనలూ లేకుండా చేస్తున్నాయి.. మనిషిలో సహజత్వంపై ప్రభావం కూడా చూపే విధంగా సాగే ఈ దాష్టికం ఇలానే  కొనసాగితే తద్ఫలితంగా జరిగే వికృతాలకు ఎవరు బాధ్యత వహిస్తారనేదే అంతుచిక్కని ప్రశ్న. వీటన్నీటికి చక్కని పరిష్కారం విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడమే. నాణ్యమైన విద్యను ప్రతీ విద్యార్ధికీ ఉచితంగానే అందించి, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకై ఈ పాలకులు పంచే పథకాల ధనాన్ని ఉచిత విద్యను అందించే దిశగా చేపట్టి తలిదండ్రులపై పూర్తి స్థాయిగా ఆ భారాన్ని తీసివేయగలిగితే వారి ఆర్ధికస్థితి మెరుగుపడడమే కాకుండా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి పోటి తత్వాన్ని నేర్పడంతో పాటూ భవిష్యత్తులో వారి కుటుంబ జీవనప్రమాణాలు మెరుగుపడే అవకాశాన్ని ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇది ఇలా ఉంటే, ప్రైవేటు విద్యా రంగంలోని యాజమాన్యాలు పూర్తిగా విద్య ఆర్ధికపరమైన అంశంగానూ వారి ఉనికికై చేసే ప్రయాసగానూ మారిపొయింది తప్ప సమాజంపై కాసింత కూడా మమకారఛాయలు లేవు. రాజకీయ కనుసన్నలలోనో, స్వయంగా రాజకీయనాయకుల చేతులలోనో నడిచే ఈ ప్రైవేటు విద్యావ్యవస్థలు సమాజానికి ఏ మేరకు ఉపయోగపడతాయో అర్ధం చేసుకోవాలి. ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధి విద్యను అంగంట్లో అమ్మే క్రూరమైన చర్యకు సమాధానం దొరుకుతుందా.?? తను నడిపే ఆ సంస్థ ఉన్నతికి విద్యార్ధులపై తీవ్రమానసిక ఒత్తిడిని తెచ్చి రాంకుల మాయలతో అటు తలిదండ్రులని, విద్యార్ధులనీ దూరపుకొండలు చూపిస్తూ, సమాజంలో క్రీడను నడుపుతున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రస్తుత సామాజిక పరిస్థితులు, తమ పిల్లలను చదివించబోయే, వారు చదువుతానన్న కోర్సులపై కాస్తైనా అవగాహన కలిగించుకుని ఆ విధంగా ప్రణాళికలు చేసుకోవాలి. వీటన్నిటికంటే ముందు తమ పిల్లలకు ఆ చదివే కోర్సు పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడా లేదా అనేది కూడా తలిదండ్రులు గమనించాలి. పిల్లలకు ఇష్టమైన కోర్సుల్లో చేర్పించి తద్వారా వారు ఆయా రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చి, విభిన్న రంగాల్లో విద్యార్థులు ఎదిగేలా విద్యా వ్యవస్థను రూపు మాపాలి. విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా భావించి మనం ఆ హక్కును వినియోగించుకునేలా చేయాలి. చదువుకునే వయసులో వారికి కలిగే భిన్నమైన అభి ప్రాయాలకు కళ్ళెం వేస్తూనే నడవడికను సరిచేయాలి. తలిదండ్రులు, గురువులు కూడా వారు చేపట్టిన ఈ బాధ్యతను రాబోవుతరాలు సాంఘిక న్యాయంగా జీవనం కొనసాగించేటట్టుగా తీర్చిదిద్ది దేశ ప్రగతికి బాటలు వేసే దారులను ఏర్పరచాలి. దీనికి తోడుగా ప్రభుత్వమే చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనందించి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మన దేశ ఉత్పత్తులకు వాటికి సంబంధించిన యంత్రాల, ముడిసరుకు దిగుమతులలో రాయితీలను అందించి నిరుద్యోగ నిర్మూలనకు తగు విధమైన ప్రణాళికలు రూపొందించి ప్రతి పౌరుడి ఆర్ధిక భరోసాకీ తగినటువంటి అవకాశాలు కల్పించకపోతే అసహనంతో కూడుకున్న వ్యవస్థలో అందరూ దోషులుగా నిలబడాల్సివస్తుంది.

                 రాజకీయాలను యువత అవకాశవాద, దోపిడీ వ్యవస్థగా పరిగణించి ఆ వైపుగా జరిగే అన్యాయాలకు స్పందించడం కూడా మానివేసి జరిగే చోద్యంలో కొంతమంది వారి ప్రయోజనాలకు దాసులైపోతున్నారు. ఇదే సమయంలో చట్టాలపై నమ్మకం కోల్పోతున్న సామాన్యుడి ఆలోచన కష్టపడకుండానే సంపాదన మార్గాలను అన్వేషిస్తూ పూర్తిగా సమాజంపై నమ్మకం కోల్పోయే పరిస్థితికి తెస్తున్నాడు. రాజకీయాలకు అతీతంగా నడపాల్సిన సామాజిక అంశాలను వారి స్వార్ధాలకు ముడిపెడుతూ పెడదారి పట్టించే ఈ రాజకీయ నాయకులకు వారిపై గల అక్రమాస్తుల, నేరారోపణలపై తగిన శిక్షలు అమలుపరిచి చట్టం అందరికి ఒకే విధంగా వ్యవహరిస్తుందనే నమ్మకం కలిగించకపోతే ఇప్పటికే ఉదాసీనంగా ఉన్న సామాన్యుడి ఆలోచన చచ్చిపోయి ఎవరికీ ఉపయోగంలేని కళేబరంగా మారిపోతే దేశానికి ప్రమాదం కూడా.    చట్టసభలలో చట్టాలు సామాన్యుడికే అన్న భావం ఇప్పటికే ప్రజలలో బలంగా నాటుకుపోయింది. ఐతే ఆ పరిస్థితిని చక్కబెట్టడానికి దేశంపై మమకారమున్న ఒక ధర్మబద్ధమైన నాయకుడు పగ్గాలు చేపట్టి పూర్తిప్రక్షాళన చేస్తే తప్ప సామాన్యుడు మన ప్రజాస్వామిక జీవనగతిలో ఫలాలు పొందలేడు.

by
భాను శ్రీమేఘన.
ట్విట్టర్ ఐడి : @ravikranthi9273 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way