విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన. వెంకట మహేష్ 39వ డివిజన్ అధ్యక్షులు ఏలూరు . సాయి శరత్ కమిటీసభ్యులు, పార్టీ నాయకులు తో కలిసి క్రైస్తవ స్మశానవాటిక ను సందర్శించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మీడియాతో మాట్లాడుతూ భవానీపురం క్రిస్టియన్ స్మశాన వాస్తవ పరిస్థితిని పరిశీలించటం జరిగిందని భవానిపురం క్రైస్తవ స్మశాన వాటికలో శవపేటికను తీసుకొని వెళ్లి నలుగురు నడిచే దారి లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేసే పరిస్థితి లేదని, ఇక్కడ స్థలం సరిపోక క్రిస్టియన్ సోదరులు మరణించిన వారిని భూస్థాపనకి చాలా ఇబ్బందులు పడుతున్నారని, క్రైస్తవులు భూస్థాపన కార్యక్రమం గాల్లో చేసుకోవాలా?అని కొన్ని సందర్భాల్లో పూడ్చిన దేహాలను కుక్కలు లాక్కెళ్ళిపోయే దుర్భర సంఘటనలు జరిగాయని, అని బ్రతికున్న వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని గద్దెనెక్కిన వైసీపీ నేడు మరణించిన క్రైస్తవులకు ఆరడుగుల స్థలం కేటాయించలేరా? అని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు క్రిస్టియన్ సోదరులు ఎన్నిసార్లు అడిగినా,గత నాలుగు సంవత్సరాలు నుండి ప్రత్యామ్నాయ స్థలం చూపడం లేదని, పశ్చిమ వైఎస్ఆర్సిపి కార్యాలయానికి 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు కానీ క్రైస్తవ స్మశాన వాటిక కు 2 సెంట్లు. స్థలం కేటాయించలేరా? అని మీకు అక్రమ కట్టడాల మీద అక్రమ సంపాదన మీద దృష్టి క్రి క్రైస్తవుల పైన లేదని, క్రైస్తవ స్మశాన వాటిక కు ప్రత్యామ్నాయ స్థలం చూపు లేకపోయారని, ఇక్కడ గంజాయి బ్యాచ్ గంజాయి త్రాగటం మందు కొట్టడం జరుగుతున్నాయని, పోలీస్ నిఘా కొరవడిందని అన్నారు. డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్ గారు మాట్లాడుతూ క్రైస్తవ స్మశాన వాటిక లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే స్థానిక నాయకులు పట్టించుకోవడంలేదని వీరు అక్రమ నిర్మాణాల దగ్గర వసూళ్లపై పెట్టిన శ్రద్ధ స్థానిక సమస్యల మీద పెట్టడం లేదని వీరు అధికారంలోకి వచ్చాక ఎంత దండుకున్నామా అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదని, క్రైస్తవ స్మశాన వాటిక వద్ద బ్యానర్ కట్టడానికైతే ఇక్కడ స్థలం కావాలి కానీ లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి మీకు సమయం లేదాఅన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏలూరి సాయి శరత్, ధారా రాము, ఏసుబాబు,పేల కోటేశ్వరరావు, సుధాకర్, ప్రసాద్, తమ్మిన లీలా కరుణాకర్, హనుమాన్, కొరగంజి వెంకటరమణ, పొట్నురి శ్రీనివాసరావు, కమల సోమనాదం, వెన్న శివశంకర్, కార్తీక్, చనమల్ చనమల శెట్టి శ్రీనివాసరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు