విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారు 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నురి. శ్రీనివాసరావు & కమిటీసభ్యులు, పార్టీ నాయకులు కలిసి గణపతిరావు రోడ్ పరిశీలించి స్థానికులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మీడియాతో మాట్లాడుతూ గణపతిరావు రోడ్లు పరిస్థితి అద్వానంగా వుందని, గణపతిరావు రోడ్డు మరియు కెటి రోడ్డు లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని, నెహ్రూ బొమ్మ, కృష్ణవేణి మార్కెట్, మిలాఫ్ హోటల్ టర్నింగ్ జంక్షన్ లను వేగవంతంగా పూర్తి చేయాలని, రెండు సంవత్సరాలు అయినా రోడ్డు పనులు పూర్తి కాలేదని, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, అంబులెన్సు కూడా రాని పరిస్థితి అని, ముందు చూపు లేకుండా ఇష్టానుసారం గణపతరావు రోడ్ కేటి రోడ్డు ఎత్తు లేపడం వల్ల అనేక ఇళ్లు ,దుకాణాలు ముంపు గురయ్యే ప్రమాదం ఉందని, దుకాణాలు యజమానులకు ఇబ్బంది లేకుండా చూడాలని, విఎంసి అధికారులు మాకు అనుమతి మంజూరు చేస్తే కేటీ రోడ్ గణపతి రావు రోడ్డు నాణ్యతా ప్రమాణాలను చెక్ చేయిస్తామని, నాణ్యతా ప్రమాణాలపై గతంలో వైసీపీ నాయకులే సందేహాలను వెలిబుచ్చారని, నేడు మేము కమిషనర్ గారిని నాణ్యతా ప్రమాణాలపై టెస్టింగ్ చేయాలని కోరుతున్నామని, కేటీ రోడ్డు కాంట్రాక్టర్ వద్ద ఒక కార్పొరేటర్ ఇల్లు కట్టించాలని మరో ఇద్దరు కార్పొరేటర్లు మాకు డబ్బులు ఇచ్చేయాలని అడుగుతున్నారనే సమాచారం ఉందని, రోడ్లు వేస్తే వైసిపి కార్పొరేటర్లకు లంచాలు ఇవ్వాలఅని? అంటే ఇక్కడున్న వైసీపీ నాయకులకు కాంట్రాక్టర్ లంచాలు ఇవ్వబట్టే పనులలో నాణ్యత లోపించిదని, కమిషనర్ గారిని దండం పెట్టి వేడుకుంటున్నామని వైసీపీ నాయకులు చేయిస్తున్న అక్రమ నిర్మాణాలకు అండగా నిలవద్దఅని అన్నారు. ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నురి. శ్రీనివాసరావు,పిల్ల శ్రీకాంత్, రేకపల్లి శ్రీను, అడ్డాల సాయి, పోతిన దుర్గారావు,పోతిన యుగంధర్,రేకపల్లి కొండలరావు,కొట్టు కుమార్, బత్తి ప్రసన్న, అడ్డగిరి పుల్లారావు, పుల్లిచేరి రమేష్,sk నాగూర్, కొరగంజి వెంకటరమణ, నెమళ సంజీవరావు, హనుమాన్, గన్ను శంకర్, పులి చేరి రమేష్, నాంచారయ్య, చలమల శెట్టి శ్రీనివాసరావు, ,బంటుమిల్లి రాంబాబు, పల్లంటి ఆది, s. నరేష్, శ్రీనివాస్,g సాయి,d జగదీష్ తదితరులు పాల్గొన్నారు
\