నెల్లూరు ( జనస్వరం ) : ముస్లింల పవిత్ర విద్యా సంస్థలైన మదరసాల విద్యా వాలంటరీ కి జీతాలు మరియు పిల్లలకు మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయండి వాటి ఉనికి కాపాడండి..
అంటూ విద్యాసంస్థల నిర్వాహకులతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 నుంచి మదరసాలకు విద్యా వాలంటీర్లకు జీతాలు కానీ పిల్లలకు మిడ్ డే మీల్స్ కానీ ప్రొవైడ్ చేయడం లేదు. ఆయా సంస్థల మెయింటైన్ చేస్తున్న నిర్వాహకులకు కష్టంగా మారింది, పలుమార్లు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినా దాని పరిష్కారం చూపులేక పోయారు. జనసేన పార్టీ తరఫున వారి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది.వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సెయింట్ పీటర్స్ విద్యా సంస్థలు, మదరసాలు, గురుకుల పాఠశాల విద్యాసంస్థ లను కానీ నిర్లక్ష్యం చేస్తూ వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ముస్లింలకు గత బడ్జెట్లో 16 కోట్ల 47 లక్షల కేటాయించుగా కోటి 20 లక్షల మాత్రమే ఖర్చు చేసి మిగిలినవి సంక్షేమ పథకాలకు మళ్ళించారు. అనాలోచితమైన నిర్ణయాలు వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పలమార్లు చెప్పినట్టు అన్ని కులాల వరకే అన్ని మతాల వారికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిందే.. బాధితులకు న్యాయం జరగకుంటే జనసేన పార్టీ తరఫున నిరసన ఉధృతం చేసి వారి సమస్య పరిష్కరించేత ఎవరు కూడా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగులు కిషోర్ తో పాటు జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, మదరసాల నిర్వాహకులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.