విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాటౌట్ కు శనివారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని విజయనగరం జనసైనుకులు చాటుకున్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వాలింటీర్లచే వైసీపి నాయకులు చేయించిన కార్యక్రమానికి నిరసనగా జనసేన ఝాన్సీ వీరమహిళలు గంట్లాన పుష్పకుమారి, మాతా గాయత్రి, పార్టీ నాయకులు రౌతు సతీష్, యర్నాగుల చక్రవర్తి ఆధ్వర్యంలో అదే స్థలంలో పవన్ కళ్యాణ్ కటౌట్ కు గుమ్మడికాయ తో దిష్టి తీసి,పాలాభిషేకం చేశారు. ముందుగా జనసేన పార్టీకు,అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వక్తలు పార్టీ నాయకులు రౌతు సతీష్, పుష్ప కుమారి,మాతా గాయత్రి , త్యాడ రామకృష్ణారావు(బాలు) జనసేన మైనారిటీ నాయకులు హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా యనలేని జనాధరణతో సాగడంతో వైసీపి పార్టీ నాయకులకు బుర్రలు పనిచేయటం లేదని, వాలంటిరీ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వాలంటీర్లకు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చులకనగా పవన్ ను వాలంటీర్లవ్యవస్తకు దూరంచేసెందుకు కార్యక్రమాలను చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ తాటాకు చప్పుళ్లకు జనసేన బెదిరేదిలేదని వైసీపీ నాయకులకు హెచ్చరించారు. వాలంటీర్లు పెద్దపెద్ద చదువులు చదువుకొని, తక్కువ జీతానికి వారి జీవితాలను వైఎస్ఆర్శీపీ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించడాన్ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ ఆవేదనను వ్యక్తం చేశారని, జగన్ కు వాలంటీర్లపై అంత ప్రేమ ఉంటే వారి ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ.. వారి జీతాన్ని పదివేలు చేసి,ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని సవాలు విసిరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పిడుగు సతీష్,లోపింటి కళ్యాణ్, రాజేష్, దినేష్,శ్రీకాంత్, బాలాజీ, ముదిలి శ్రీనివాస్, మధు,భాస్కర్, భవాని, తదితర జనసైనికులు భారీగా పాల్గొన్నారు.