విజయవాడ ( జనస్వరం ) : పాత శివాలయం శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో గత ఈవో హేమలతాదేవిపై దేవాదాయ శాఖ అధికారులు జరిపిన విచారణలోని వాస్తవాలను బహిర్గతం చేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన మహేష్ ఆన్నారు. ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలు బయటికి వచ్చి శిక్ష పడుతుందనే విజిలెన్స్ విచారణ చేయించలేదా ? అందుకే శాఖాపరమైన విచారణ చేస్తున్నారా? రెండు ఎకరాల భూమి ఎవరి అనుమతితో అమ్మకం చేశారు. ఆ భూమి దేవాదాయ శాఖదని,.25,38,43 రిజిస్టర్లో నమోదు అయి ఉన్నాయి కదా. ఒకే బిల్లు రెండుసార్లు పెట్టి డబ్బులు కొట్టేసిన మాట నిజమా కాదా? ( Bill no: 018, Amount : 36899 /- ) ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన 90 లక్షల రూపాయలలో జరిగిన అవినీతి ఎంత? విచారణలో తేలింది ఎంత? అధికారులు కొట్టేసింది ఎంత? గత ఈవో హేమలతా దేవి గారి అవినీతి అక్రమాలను విచారణ చేసిన ఏసీ శాంతి గారు డిసి విజయరాజు గారు ఆర్ జె సి సురేష్ బాబు గారు ఏం నిగ్గు తేల్చారు. నివేదికను ఎందుకు బహిరంగపరచడం లేదు. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఈ ఆలయంలోని అవినీతి వ్యవహారాలు అన్ని పక్కదారు పట్టించి ఆస్తులు కొట్టేయాలని స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నూతన కమిటీ ఏర్పాటు పై దృష్టి సారించిన మాట నిజమా కాదా? ఈవో హేమలతదేవి గారిపై విజిలెన్స్ విచారణ చేయకుండా దేవాదాయ శాఖ మాత్రమే విచారణ చేస్తుంది వారికి క్లీన్ చిట్ ఇచ్చేందుకేనా? అని అన్నారు.