తిరుపతి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేయ తలచిన సందర్భంగా వినుత కోటా గారిని గృహ నిర్భంధం చెయ్యడం, జిల్లా కార్యదర్శి కొట్టే సాయి గారిని చెయ్యి చేసుకుని అమానుషంగా పోలీస్ స్టేషన్ కి తరలించడాని ఖండిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తిరుపతి ప్రెస్స్ క్లబ్ నందు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ మరియు నేషనల్ మీడియా ప్రతినిధి శ్రీ. అజయ్ కుమార్ గారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి పోలీసుల అత్యుత్సాహం, దుశ్చర్యలను ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మా నాయకుడి పై చెయ్యి చేసుకుని అమానుషంగా ప్రవర్తించిన శ్రీకాళహస్తి 1 టౌన సీఐ పైన చర్యలు తీసుకోవాలని , తక్షణమే ఆమెను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. లేని పక్షంలో హుమన్ రైట్స్ కమిషన్ మరియు న్యాయపరంగా గట్టిగా పోరాడతామని తెలిపారు. ప్రజా స్వామ్య బద్దంగా నిరసన తెలియజేసే హక్కు ప్రతిపక్ష పార్టీ గా మా హక్కు, దిష్టి బొమ్మ దగ్ధం చెయ్యడం నిరసన లో భాగమని గౌరవ మద్రాస్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రొద్భంతో గత 4 సం.|| గా జనసేన పార్టీ పైన పోలీసులను అడ్డు పెట్టుకొని అనేక కేసులు పెట్టీ ఇబ్బందులు పెట్టారని!! ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలకు శ్రీకాళహస్తి పట్టణం మొత్తం దిగ్బంధం చేసి 3 రోజులు పట్టణ ప్రజలను, గుడికి వచ్చే భక్తులను ఇబ్బందులు పెట్టినపుడు నిబంధనలు పోలీసులకు గుర్తు రాలేదా, అప్పుడు ఆక్ట్ 30 ఏమైందని ప్రశ్నించారు. పోలీసులు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కోసం పని చెయ్యాలని కానీ!! వైసీపీ పార్టీ తొత్తులుగా వ్యవహరించవద్దని తెలిపారు. నాయకులు కొట్టే సాయి గారికి పార్టీ అధిష్టానం పూర్తి అండ ఉంటుందని, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయమై శ్రీకాళహస్తికి వచ్చి మద్దతు తెలిపి అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి శ్రీమతి వినుత కోట, జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజా రెడ్డి, కృష్ణయ్య , ఆనంద్, ముక్కు సత్యవంతుడు, జనసైనికులు మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.