– ఖైదీ దిష్టి బొమ్మ దగ్దం చేశాం అంతే…
– జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటు సమన్వయ కర్త డాక్టర్ మైఫోర్స్ మహేష్
మదనపల్లి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దగ్దం చేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేని పక్ష్యంలో పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దగ్దం చేసున చోటే సిఎం జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేసి తీరుతామని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటు సమన్వయ కర్త డాక్టర్ మైఫోర్స్ మహేష్ ప్రకటించారు. గురువారం జనసేన పార్టీ ఆద్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన చోట పసుపు నీటితో శుద్ది చేసారు. ఈ సందర్భంగా పోలీసులకు జనసేన పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మదనపల్లె వన్ టౌన్, టూ టౌన్ సిఐలు మురళీకృష్ణ, మహబూబ్ బాషా ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఇంటిలిజెన్స్ పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మైఫోర్స్ మహేష్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు వాటర్ క్యాన్ నిండా పసుపు నీరు తీసుకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. పసుపు నీరు అని పదే, పదే చెప్పినా పరిశీలించాలని పట్టుపట్టారు. ఈ సందర్భంగా కొంత తోపులాట జరిగింది. రోడ్డుపైన నిరసన వ్వక్తం చేయకుండా పోలీసులు అడ్డుకుని పక్కకు తోసివేశారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ అధికార వైసిపి వారికి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీలకు ఒక చట్టం అమలు చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం తగదని, ఖచ్చితంగా వైసిపి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు ముసుగులో వైసిపిలో పదవులు వున్న వారు, జడ్పీటీసీ, కౌన్సిలర్లు నాయకులు పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దగ్దం చేశారని, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన చోటే దిష్టి బొమ్మ దగ్దం చేయాలని ప్రయత్నం చేస్తే ఉదయం నుండి పోలీసులు అడ్డుకుని దిష్టి బొమ్మ లాక్కెళ్ళడం శోచనీయం అన్నారు. వైసిపి నాయకులు, వాలంటీర్లుపై కేసులు నమోదు చేయాలని లేనిపక్షంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఇదే చోటు సిఎం జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేసే వరకు వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. వైసిపి నాయకులపై కేసు నమోదు చేయని పక్ష్యంలో కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. ఉదయం నుండి పోలీసులు చుట్టుముట్టి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం పోలీసు భయాన్ని తెలియజేస్తోందని అన్నారు. రాబోయే రోజులో జనసేన పార్టీ అధికారంలోకి ఖాయమని అన్నారు.