నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు పేదల ఇళ్ల పట్టాల విషయంలో జరిగిన అవినీతి గురించి శ్వేత పత్రం విడుదల చేయగలరా… అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, బుచ్చి మండల ఇంచార్జ్ మాధవ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో ఏదో వ్యామోహం ఆస్తిపాస్తులు కూడా పోగొట్టుకున్నారని స్థానికులు ప్రసన్న గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను,గురువింద కింద నలుపు తనకి తెలియదు అంట. పాపం నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు చాలా మంచివారు,సాధించిన ఘన చరిత్ర అంతా మట్టిపాలు చేస్తున్నారు మీరు. పెద్దాయన అందరికీ మేలు చేసినట్లు సమాచారం మీరు చుట్టుపక్కన ఉన్న వారి చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారని సమాచారం. మీ చుట్టూ ఉన్న ఒకరిద్దరు వెనుకబడిన తరగతులకు చెందిన వారికి తప్ప మరెవరికి ఏమి మీరు చేసింది లేదు.. బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం చేసిదేమీ లేదు పార్టీ తరపున ఆయా సెల్ లో మీరు అధ్యక్షులుగా నియమించిన నాయకులను అడగండి. గతంలో వాహనాలు,చిన్న తరహా పరిశ్రమల కైతే ఏమి ప్రభుత్వం కొంత లోన్లు ఇచ్చి కొంత సబ్సిడీ కూడా ఇచ్చేది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎస్సీ బీసీ ఎస్టీ తరపున ఒక్క రూపాయి కూడా అందిన పరిస్థితి లేదు. ఏ ముఖం పెట్టుకొని మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని లబోదిబోమంటున్నారు. సిగ్గు లేకుండా మళ్లీ వారి గురించి మాట్లాడుతున్నారు,మీ చుట్టుపక్కల ఉన్న అదే పెత్తందారునిలకు తప్పిస్తే నియోజకవర్గం లో ఎవరూ లబ్ది పొందినది లేదు,ఎంతో ఇబ్బందులు పడుతున్న ఆయా వర్గాలను ఉద్ధరించినట్లు ప్రగల్బాలు పలకవద్దు. పేదలకు ఎమ్మెల్యే పంచిన ఇళ్లపట్టాలని వెనక్కి ఎందుకు తీసుకున్నారు. కంటోన్మెంట్ వివిధ కారణాల వలన క్యాన్సిల్ చేసిన ప్లాట్లు గల వివిధ కారణాలు ఏమిటో తెలుపగలరు ..? అప్లై చేయని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఎలా వచ్చాయి. కేటాయించిన ఇళ్ల స్థలాల్లో బాధితులు వెళ్లి చూస్తే వేరొకరు ఇల్లు కట్టుకునే పరిస్థితి. కేవలం పేదలకు చెందాల్సిన ఇళ్ల విషయంలో భారీ అవినీతి జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంలో దాదాపు 2500 ప్లాట్లు పంచగా 700 ప్లాట్లు అర్హులకు అఅందలేదు. ఎమ్మెల్యే అనుచరులు తప్ప పెద్దగా పేదలు ఎవరికి అందలేదని గట్టి సమాచారం, ఇల్లు లేని ఇవ్వాల్సిన స్థలాలు వేరొక స్థలం ఉండగా ఎలా ఇచ్చారు తెలుపగలరు. ఎకరా 35 లక్షల పైన ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ స్థలాలు పేదలకు ఉపయోగపడినవా..?
ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, మాధవ్ తో పాటు షారు, సాయి, ఖాసిఫ్, షాజహాన్ మౌనిష్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.