అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను వివరిస్తూ… తాము అధికారంలోకి వస్తే అనంతనగరానికి ఏమి చేయబోతున్నాము రూపొందించిన మేనిఫెస్టోను పంపిణీ చేస్తూ జనసేన అనంతపురము అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనసేన జయభేరి కార్యక్రమానికి జననీరాజనం లభిస్తోంది. సోమవారం పాతూరు ఆసరమల్లా వీధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళుతూ టి.సి.వరుణ్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పట్ల అవగాహన, వాటి పరిష్కారాల పట్ల చిత్తశుద్ధి కలిగిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆమిదాల వీధిలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం.. జనసేన జయభేరి కార్యక్రమంలో భాగంగా ఆమిదల వీధికి చేరుకున్న టి.సి.వరుణ్ గారి దృష్టికి స్థానిక మహిళలు డ్రైనేజీ సమస్యను తీసుకొచ్చారు. ఇందుకు వెంటనే స్పందించిన ఆయన రెండు రోజుల్లో డ్రైనేజీని శుభ్రం చేయించడంతో పాటు సొంత నిధులతో బండలు వేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాప్తాడు ఇంచార్జ్ పవన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు రపా ధనుంజయ్, కిరణ్ కుమార్, జయమ్మ, అవుకు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు రోల్ల భాస్కర్, మేదర వెంకటేష్, హుస్సేన్, దరాజ్ భాష నగర కార్యదర్శిలు లాల్ స్వామి, మురళి, మతి.జిక్కిరెడ్డి పద్మావతి, వెంకటరమణ, నెట్టిగంటి హరీష్, ఆకుల అశోక్, మండల అధ్యక్షులు తోట ఓబులేసు, కార్యక్రమాల కార్యనిర్వహణ కమిటీ సభ్యులు సంతోష్ మరియు నాయకులు చరణ్, కట్టెల శీన, కాకర్ల శీను, హిద్దూ, బాబ్జాన్, సల్మాన్, నజీమ్, చంద్ర, దేవరాయల విజయ్, విశ్వనాథ్ మరియు వీరమహిళలు పార్వతి, సరిత మరియు తదితరులు పాల్గొన్నారు.