గుంతకల్ ( జనస్వరం ) : గుత్తి మండలం, చెర్లోపల్లి గ్రామం అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, గుత్తి పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, సీనియర్ నాయకుడు బోయగడ్డ బ్రహ్మయ్య సమక్షంలో పార్టీలోకి పెద్దఎత్తున యువకులు, పెద్దలు చేరారు. జనసేన పార్టీలోకి చేరిన గ్రామస్తులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అద్భుతమైన పోరాట స్ఫూర్తిని చూసి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా యువకులకు, పెద్దలకు అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత ఆ గ్రామంలోని పలు సమస్యలను పరిశీలించి, రాబోయే రోజుల్లోగ్రామ సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని గ్రామస్తులకు భరోసానిస్తూ గ్రామంలోని ప్రతి ఇంటి ఇంటికి తిరిగి జనసేన పార్టీని ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఓడిపోయిందే కానీ, ఎక్కడ ఆగిపోలేదని. 25 కేజీల బియ్యం కోసం కాదు 25 సంవత్సరాల బావి భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారని అన్నారు. నిత్యం పేద ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తూ దేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా అన్నం పెట్టే రైతన్న కుటుంబాలకి అండగా ఉండాలని ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు తన సొంత డబ్బును వెచ్చించి 30 కోట్ల రూపాయలు, 3000 వేల కౌలు రైతు కుటుంబాలకు “కౌలు రైతు భరోసా యాత్ర” ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 1లక్ష రూపాయలు అందిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల భద్రతా – భవితవ్యం కోసం 5 లక్షల రూపాయల ప్రమాద బీమా 50వేల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ చేయించి కార్యకర్తల పట్ల తనకున్న గొప్ప మనసును చాటుకున్నాడు. గుంతకల్ నియోజకవర్గం లో జనసేన పార్టీ బలపడుతుంది అన్నదానికి పార్టీకి చెర్లోపల్లిలో వచ్చిన ఆదరణ నిదర్శనమని, అందరూ ఏకతాటిపై నడిచి జనసేన పార్టీ బలోపేతానికి కృషిచేసి గుంతకల్ నియోజకవర్గం లో రాబోవు ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను సీఎం చేసే దిశగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుత్తి పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్, సీనియర్ నాయకులు బోయ గడ్డ బ్రహ్మయ్య మరియు చెర్లోపల్లి గ్రామంలోని పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.