నెల్లూరు ( జనస్వరం ) : జనసేన తరపున గత నెలరోజులుగా శ్రామిక నగర్ లో రోడ్లు,డ్రైనేజీ,నీరు సరఫరా దుస్థితిని వివరిస్తూ పలుమార్లు జనసేన తరఫున ప్రశ్నించిన సంగతి విదితమే… ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతం ను సందర్శించి మొత్తం ఎస్టిమేట్ చేస్తే దాదాపుగా 55 లక్షలు అవుతుంది.ప్రస్తుతానికి కార్పొరేషన్ లో నిధులు లేవు కాబట్టి ముఖ్యంగా అవసరమైన రోడ్లను గుర్తించి వాటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. స్థానికులతో మాట్లాడి స్కూలు వెనుక రోడ్డు అలాగే తమ గ్రామ దేవత పోలేరమ్మ వద్ద గల వీధులను ముందుగా వేయవలసిందిగా స్థానికులు కోరారు. వీలైనంత త్వరగా ఈ రెండు రోడ్లను నిర్మిస్తామని స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మౌలిక వసతుల లేమి తో ప్రాంత వాసులు నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని అధికారులు త్వరగా స్పందించి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సహయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. శ్రామిక నగర్ లో మంచినీటి సరఫరా రెండు రోజులకు ఒకసారి ఒక గంట మాత్రమే వస్తుంది,కలుషితమైన మీరు వస్తుందని వాటిని నివారించాల్సిందిగా తెలిపారు. వైయస్సార్ నగర్ లో నీటి ట్యాంకు ద్వారా సరఫరా చేసే నీరు కొన్ని ప్రాంతాలకు అందట్లేదని తగు చర్యలు తీసుకొని ఆయా ప్రాంతాలకు అందే విధంగా చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి పైపులైన్ కనెక్షన్ ఇప్పించేందుకు మేము కూడా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, స్థానిక నాయకులు శ్రీను, హేమచంద్ర యాదవ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.