విశాఖపట్నం ( జనస్వరం ) : జీవీఎంసీ 41 వ వార్డు జ్ఞానాపురంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు ఇళ్లల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలక్ట్రికల్ వస్తువులు ఇతర సామాన్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించిన మరియా, జ్యోతి కుటుంబాలకు ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు అందజేశారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి వారికి అండగా నిలిచారు. అలాగే అదే వార్డులో పుష్పవతి అయిన లలిత అనే అమ్మాయికి పట్టు బట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఒక మంచి లక్ష్యంతో కొనసాగిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 70వ రోజుకు చేరుకుందని చెప్పారు. ఈ 70 రోజులలో దక్షిణ నియోజకవర్గంలోని సుమారుగా అన్ని వార్డులలో పర్యటించడం జరిగిందన్నారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంతోమందికి తన పరిధి మేరకు సహాయం చేసినట్లు చెప్పారు. పవనన్న ప్రజా బాట కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావలసి వచ్చిన తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు, వీర మహిళలు అంతొనీ, అనిల్, రామారావు, అప్పారావు, శ్రీను, సూరి, మనోహర్, మని, లలిత, జానకి, మంగ, రాజేశ్వరి, సునీత, దుర్గ, కుమారి, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.