విజయనగరం ( జనస్వరం ) : స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న డివైడర్లును తొలగించి ప్రజలకు వాహనదారులకు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ను కోరారు. ఈ విషయంపై సోమవారం ఉదయం జిల్లా పోలీస్ సూపరెండెంట్ దీపిక పాటిల్ నిర్వహించిన స్పందనలో పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు), అడబాల వెంకటేష్ వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక తోటపాలెం నుండి కాంప్లెక్స్ మీదుగా వచ్చే ప్రజలకు,కాంప్లెక్స్ నుండి తోటపాలెం నకు వెళ్ళే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు, హాస్పటల్ పనిమీద వెళ్ళే ప్రజలు మరింత ఇబ్బంది పాలు అవుతున్నారని, ట్రాఫిక్ నియంత్రణ కోసం తోటి పాలెం ప్రధాన రహదారికి అడ్డుగా సిమెంట్ దిమ్మల దివైడర్లను ఏర్పాటు చేయడం వలన పగలంతా వాహనాలతో ట్రాఫిక్ నిలిచి ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని వెంటనే ఆ డివైడర్లు తొలగించి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలనుండి విముక్తి కలిగించాలని కోరామని, ఈ సందర్భంగా ట్రాఫిక్ స్యలపై [అక్షరకెరటం] తెలుగు దినపత్రికలో ప్రచురితమైన [ ట్రాఫిక్ సమస్యలు తీరేదెన్నడో].అనే కథనంతో కూడిన పత్రికను వినతి పత్రంతో పాటు జతపరచి ఇచ్చామని, ఈ విషయంపై వెంటనే స్పందించినా జిల్లా పోలీస్ సూపరెండెంట్ త్వరలోనే ఈసమస్య ను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి నట్లు చెప్పారు.