సర్వేపల్లి ( జనస్వరం ) : జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా పూడిపర్తి గ్రామంలో వేసిన జగనన్న ఇళ్ల స్థలాలు లేఅవుట్ చిన్నపాటి వర్షాలకు మునకకు గురి కావడంతో పరిశీలించి అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జగనన్న లేఔట్ లు నామమాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది పూడిపర్తిలో పేదలకు ఇచ్చే ఏళ్ల స్థలాల పరిస్థితి ఎలాగ ఉందో చూడండి. రొయ్యలగుంటను తలపించే విధంగా ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తే వెంకటాచలం మండలంలో కోట్ల రూపాయల విలువచేసి గ్రావెల్ మాత్రం పేదల ఇళ్ల స్థలాలకి అని చెప్పి పరిమిషన్ తీసుకునేది ఇక్కడ చూస్తే కనీసం ఒక టిప్పర్ మట్టితోలని పరిస్థితి. మీరు గమనిస్తున్నటువంటి నీళ్లతో నిండిపోయిన ఇళ్ల స్థలాలన్ని కూడా జగనన్న లేఔట్ లో పేదలకి ఇచ్చిన ఇళ్ల స్థలాల హద్దులు పూర్తిగా వర్షాకాలం రాకముందే నీళ్లలో ఉండాయి. అంటే వర్షాలు వస్తే ఎంత లోతు నీళ్లతో ఈ ప్లాట్లు నిండిపోతాయో ఒకసారి అందరూ ఆలోచించాలి. మోసపూరితమైన అంశాలతో మసిబుసి మారేడు కాయ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి కూడా కలబొల్లి మాటలతో పరిపాలన కొనసాగిస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గనికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి ఆయన సర్వేపల్లి నియోజకవర్గం కనీసం మట్టి కూడ తోలిన పరిస్థితులు కూడా లేవు. కనీస వసతులు కూడా లేనీ విధంగా ప్లాట్లు ఉన్నాయి. ప్రజలు ప్రజలందరూ గమనించండి ఒక్కసారి ఆలోచించండి రాబోయే ఎన్నికలలో మీరు ఓటు వేసే ముందు వాళ్ళు ఇచ్చే 500 కి ఆశ పడి మోసపోవద్దు. జనసేన పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది ప్రజలే పాలకులవుతారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఖాజా, రహీం, శ్రీహరి, మల్లి, సంజు తదితరులు పాల్గొన్నారు.