ముద్రగడ గారికి నమస్కారం అండి….
ముందుగా ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు నచ్చక రాసిన లేఖ ప్రారంభంలో ప్రముఖ సినీనటులు అని ఎందుకు రాశారు అండి? కేవలం సినిమాలకు పరిమితం చేద్దామని మీ ఉద్దేశ్యమా అండి? 2019 ఎన్నికల్లో 9వ షెడ్యూల్ సవరణ ద్వారా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని జనసేన హామీ ఇస్తే ఎందుకు మీరు మద్దతు తెలపలేదండి? కాపు రిజర్వేషన్ నా చేతులో లేదు అని చెప్పినా సరే ఎందుకు జగన్ రెడ్డి పల్లకి మోసారండి? రాచరిక మనస్త ఉన్న జగన్ రెడ్డి కి బొత్సా, పిల్లి బోస్ లాంటి వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని ఎలా అడిగారండీ? ఇన్నేళ్ల అనుభవంలో ఈ మాత్రం అర్దం చేసుకోలేకపోవడం భాద కలిగించింది అండి. తండ్రి శవం దగ్గర ముఖ్యమంత్రిని చేయమని సంతకాలు సేకరించిన వ్యక్తిని ఎలా అడిగారండి? పవన్ కళ్యాణ్ గారి మాటలు నచ్చడం లేదు అన్నారండి, మరి ద్వారంపూడి మాట్లాడిన “లంజ” మాటలు కమ్మగా ఉన్నాయా అండి? వాళ్ళు తిడితే పడమంటారా అండి? మీకు మంత్రి పదవి వచ్చేలా చేసారనో, మీ ఇంటి శుభ కార్యాలకు వచ్చినంత మాత్రాన మహానుభావుడు అయిపోరండి, రౌడీ ఎప్పటికీ రౌడీ అనే అంటారు అండి. మీటింగులకు లారీలు, వాల్ పోస్టర్లకు డబ్బులు ఇచ్చారని ప్రజల నోట్లో మట్టికొడతా అంటే చూస్తూ ఉండలేం కదండీ. ఎందుకండి ఎప్పుడు కాపులు ఏకమైనప్పుడు YCP కి నష్టం జరిగేప్పుడు వచ్చి లేఖలు రాస్తారండి. స్వర్గీయ వంగవీటి రంగా గారిని చంపించారు అని చెప్పే అదే తెలుగుదేశం పార్టీతో మీరు ఎందుకు కాపురం చేసారండి. 2004 లో కూడా ఎంపి గా టిడిపి లో ఉంది పోటీ చేశారు కదండీ. కానీ జనసేన పొత్తు పెట్టుకోవాలనుకుంటే మాత్రం కాపులకు అన్యాయం చేసినట్లు ఉద్దేశం కదండీ? మరో ముఖ్యమైన విషయం కొంతమంది కాపు నాయకులు వాళ్ళ స్వార్ధయానికి పనిచేస్తున్నారు అనగానే, మీ పేరు చెప్పకపోయినా ఎందుకండి మీరు భుజాలు తడుముకుంటున్నారండి? ఇంకో విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు ఒక్క కులానికి మాత్రమే కాదండీ అన్ని కులాలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారండి, వంగవీటి రంగా గారు కూడా న్నీ వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి అండి, కానీ కొంతమంది మీలాంటి వారు ఆయనను కాపులకు పరిమితం చేసారండి. ఈసారి అలా జరగదు అండి. ఇంతకు మించి చెప్పడానికి ఏమి లేదండీ. మరోసారి మరో లేఖతో రాకుండా మీ కాపు నాయకుడిగా మీ పెద్దరికం నిలబెట్టుకోవాలంది. నమస్కారమండి, ఉంటాను అండి.
– శ్రీరామ్ ( జనసైనికుడు )