బొబ్బిలి, (జనస్వరం) : విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గంలో సేంద్రియ విధానంలో బెల్లం తయారు చేసిన రైతులను ఆదుకోండి అంటూ జనసేనపార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి, జిల్లా నాయకత్వం నేత్రృత్వంలో కోమటిపల్లి మరియు ముగడ గ్రామాల రైతులు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. బెల్లం తయారు చేసి 6 నెలలు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం టిటిడి బోర్డ్ మరియు జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, మంత్రి బొత్స మరియు స్థానిక MLA చినప్పలనాయుడు మాకేంటి సంబంధం మీరు టీటిడితో మాట్లాడుకోండని రైతులకు జవాబివ్వడం చాలా హాస్యాస్పదంగా ఉందని, జిల్లా చైర్ పర్సన్ చిన్న శ్రీను గవర్నమెంట్ కొనలేదు గాని ప్రైవేట్ వ్యక్తలకు చెప్పి ఏదోక ధరకు అమ్మి పెడతా అనడం ఎంత భాద్యతా రాహిత్యమో ఈ ప్రభుత్వం తెలుసుకోవాలని రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, జిల్లా నాయకులు మర్రాపు సురేష్, గురాన అయ్యలు, ఆదాడ మోహన్ దుయ్యబట్టారు. ఈ బెల్లం కొనుగోలు మరో 3 రోజులు వ్యవధిలో కొనుగోలు చెయ్యాలి, లేదంటే ప్రభుత్వమే భాద్యత వహించి రైతుల వద్ద నిల్వ ఉన్న బెల్లాన్ని తీసుకెళ్లి ఏదైనా కోల్డ్ స్టోరేజ్ నిల్వ చేసి అమ్మకం జరపాలని, రైతులకు ప్రకటించిన కేజీ 80/- ధరలనే డబ్బులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లేనియెడల 3 రోజులు తర్వాత రైతులతో పాటుగా జనసేన పార్టీ తరఫున మేము కూడా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని మేడియా ముఖంగా వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. కేవలం 40 లక్షలు విలువ కలిగిన 50 టన్నులు బెల్లాన్నే ఈ వైసిపి ప్రభుత్వం కొనుగోలు చెయ్యలేకపోతే, ఇక రైతులకు ఏ విషయంలో మీరు మేలు చేస్తున్నట్టు, మీ స్టిక్కర్లకి మీటింగులకి ప్రచారాలకి కొన్ని వందల కోట్లు ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్న వైసిపి ప్రభుత్వానికి రైతుల కన్నీరు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బెల్లం రైతులు, వీరమహిళ విభాగం ఉత్తరాంధ్ర కోర్డినేటర్ తుమ్మి లక్ష్మి, జిల్లా నాయకులు మిడతాన రవి, సంచాన గంగాధర్, తుమ్మగంటి సూరినాయుడు, పోతల శివ శంకర్, వెంకట రమణ, రమేష్ రాజు, చీమల సతీష్, మండల అధ్యక్షులు రౌతు క్రిష్ణవేణి, విసనగిరి శ్రీను, పతివాడ క్రిష్ణవేణి, యర్నగుల చక్రవర్తి, రాజారావు, ప్రకాష్, శంకర్, నరసింగరావు, వెంకటేష్, హుస్సేన్ ఖాన్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.