సర్వేపల్లి నియోజకవర్గంలోని అక్రమ గ్రావెల్ రవాణా అరికట్టాలి : నెల్లూరు జిల్లా జనసేన నాయకులు

     సర్వేపల్లి, (జనస్వరం) : సర్వేపల్లి నియోజకవర్గంలోని అక్రమ గ్రావెల్ రవాణా అరికట్టాలంటూ సర్వేపల్లి నాయకుడు బొబ్బేపల్లి సురేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజ వనరులే కేంద్రంగా, అధికారమే అనుమతులుగా, అక్రమార్జునే లక్ష్యంగా ప్రకృతి వైపరీత్యాలను, ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వి ఈ వైసీపీ నాయకులు అడ్డువచ్చిన పేదలను పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

• రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది :       

     కోవూరు, సర్వేపల్లి, గూడూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు ఇదే పనిలో ఉన్నారు. ఎన్నిసార్లు మైనింగ్ అధికారులకు గాని కలెక్టర్ కార్యాలయంలో గాని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అదను చూసుకొని రాత్రులు అక్రమ రవాణా జరుగుతుంది. జనసేనపార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలోని ఇసుక ట్రావెల్ సిలికాన్ అక్రమ రవాణాను అరికట్టేందుకు నిలదీసేందుకు జనసైనికులు రెడీగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మేలుకొని అక్రమ తవ్వకాలకు స్వస్తి చెబితే బాగుంటుంది. నాలుగు సంవత్సరాలలో 40 సంవత్సరాలు సరిపడా అక్రమ సంపాదన మూట కట్టుకున్నారు. ప్రజా ప్రభుత్వం జనసేనపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీరు చేసిన అక్రమాలు అన్నిటికి సమాధానం చెబుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సర్వేపల్లి నాయకుడు బొబ్బేపల్లి సురేష్, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, రవికుమార్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, రాజా, ఖలీల్, ప్రసన్న, మౌనిష్, హేమంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way