గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పత్రికా సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. జనసేన పార్టీ గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఇసుక దోపిడీ విపరీతంగా జరుగుతుందని, దానికి నిదర్శనంగానే ఈ రోజు కడప జిల్లాలో నారాయణరెడ్డి అనే వ్యక్తి దగ్గర ముఖ్యమంత్రి గారి సమీప బంధువు వీరారెడ్డి అనే వ్యక్తి వల్లూరు మండలం ఆది నిమ్మాయపల్లి వద్ద ఇసుక రీచ్ ఇప్పిస్తామని చెప్పి సుమారు 81 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. కాని తర్వాత అక్కడ రీచ్ లేదని తెలుసుకొని డబ్బులు వెనక్కిమ్మని అడగ్గా ఎవరు చెప్పినా డబ్బులు ఇవ్వను నీకు దిక్కున్న చోట చెప్పుకొ అని చెప్పడంతో ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో ఇసుక మొత్తం జేపీ వెంచర్స్ కి అప్ప చెప్పామని చెప్పి జిల్లాకు ఒక అధికార పార్టీ నాయకుడికి అప్పచెప్పి వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. జేపీ అనేది డొల్ల కంపెనీ అని, ఎన్నిసార్లు అడిగినా ఆ కంపెనీ ప్రతినిధులు గాని, వైసిపి నాయకులు గాని ఆ కంపెనీ గురించి మాట్లాడలేదు. దీని అర్థం జేపీ కంపెనీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి డొల్ల కంపెనీ అని చెప్పి తెలియజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి ఎన్ని విధాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకుంటూ దోపిడీలో సరికొత్త దారులు చూపిస్తా ఉంది. అలాగే పెరిగిన కరెంటు చార్జీలు, బస్ చార్జీలు, పెట్రోల్ రేట్లపై సమాధానం చెప్పలేం ప్రభుత్వాన్ని కొరగా సంబంధం లేని వ్యక్తులు వచ్చి ప్రభుత్వ విషయాలు మాట్లాడతారని, ప్రభుత్వ విషయం మాట్లాడాల్సిన ప్రజా ప్రతినిధులు సంబంధం లేకుండా మాట్లాడుతారని తెలియజేశారు. అలాగే వైసిపి 99.5% హామీల అమలు చేశామని అసత్య ప్రచారం చేస్తుందని, నిజంగా మీరు అమలు చేస్తే ఏ విధంగా అమలు చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. అలాగే జూన్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర ప్రారంభిస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో అనాదిగా పేరుకుపోయిన ప్రతి సమస్యను ప్రజల ముందు పెడతామని అలాగే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులేస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గ నుంచి వారాహి యాత్రలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున జన సైనికులు సమాయత్తమవుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, 47వ డివిజన్ కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, గుంటూరు నగర కార్యదర్శిలు తన్నీరు గంగరాజు, నెల్లూరు రాజేష్, డివిజన్ ప్రెసిడెంట్లు మధులాల్, దాసరి వెంకటేశ్వరరావు, గోపిశెట్టి సాయి, బిసబత్తుని సాయి మరియు తదితరులు పాల్గొన్నారు.